Breaking News

ఒకే బిల్లు.. చెల్లింపులు రెండు!

Published on Thu, 06/13/2024 - 04:21

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ఖజానాకు నిధుల కటకట ఉండగా, ప్రతీ పనికి ప్రభుత్వం ఒక వైపు ఆచితూచి ఖర్చు పెడుతుంటే.. మరోవైపు రాష్ట్ర ట్రెజరీ విభాగం మాత్రం ఒకే చెక్కుకు రెండేసి చొప్పున చెల్లింపులు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌ శాఖ ఒక ప్రైవేటు కంపెనీతో ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐఎఫ్‌ఎంఎస్‌) అమలు చేయిస్తోంది. దీనిపై ఐదేళ్లుగా ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. 

తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎస్టీఓ పరిధిలో ఒకే మొత్తానికి సంబంధించి ఒక చెక్‌ను స్థానిక అధికారులు క్లియర్‌ చేయగా, అదే చెక్‌ను స్థానిక అధికారుల ప్రమేయం లేకుండానే ఆన్‌లైన్‌ పద్ధతిలో ఈ–కుబేర్‌ నుంచి చెల్లించేశారు. వివరాల్లోకి వెళితే వలిగొండ మార్కెట్‌ కమిటీ నుంచి గత నవంబర్‌ 22న వచ్చి న రూ.30,65,987 (టోకెన్‌ నంబర్‌ : 2438538332) మొత్తాన్ని ఖజానాలో సరిపోను నగదు లేని కారణంగా ఈ ఏడాది మార్చి 31న రిజెక్ట్‌ చేశారు. 

అదే మొత్తం కోసం తిరిగి ఈ ఏడాది ఏప్రిల్‌ 25న చెక్‌ను మళ్లీ సబ్మిట్‌ చేస్తే.. రామన్నపేట ఎస్‌టీఓ అనుమతితో మే 30న రూ.30,65,987 మొత్తాన్ని సంబంధిత అకౌంట్‌కు బదిలీ చేశారు. మళ్లీ అదే మొత్తానికి సంబంధించి మరో చెక్‌ (నం. 251940047) ఎస్‌టీఓ ప్రమేయం లేకుండానే మరో రూ.30,65,987 మొత్తాన్ని అదే అకౌంట్‌కు బదిలీ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన రామన్నపేట సబ్‌ట్రెజరీ అధికారి (ఎస్‌టీఓ).. ఉన్నతాధికారులకు నివేదించి, ఆపై రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

తమ ఐడీ, పాస్‌వర్డ్‌లను వాడుకుని ఖాతాల నుంచి చెల్లింపులు చేస్తున్న అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ ఎంప్లాయీస్‌ గెజిటెడ్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.  

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)