MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
‘జలకన్య కన్ను’ పేరుతో బురిడీ
Published on Fri, 02/10/2023 - 08:47
సాక్షి, హైదరాబాద్: జలకన్య కన్నుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని, దీంతో మీకు అంతా శుభం జరుగుతుందని, కోరుకున్న పని ఇట్లే జరిగిపోతుందని కల్లబొల్లి మాటలు చెప్పి అందినకాడికి దండుకోవాలని భావించిన నిందితుల ఆటకట్టించారు మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు.
- వరంగల్‌కు చెందిన చందు, యాప్రాల్‌కు చెందిన సాంబశివ ఇద్దరు స్నేహితులు. తీర్థయాత్రల నిమిత్తం షిరిడీకి వెళ్లిన ఇరువురు.. తిరుగు ప్రయాణంలో స్థానికంగా దొరికే రంగు రాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక ఆ రంగురాయిలో బ్యాటరీ సహాయంతో చిన్నపాటి లైట్‌ను అమర్చారు.
- లైట్ అమర్చిన రంగురాయికి నీళ్లు తాకగానే దాని కాంతి రెట్టింపు అవుతుంది. దీన్ని గమనించిన చందు, శివలకు దుర్బుద్ధి పుట్టింది. రంగురాయికి శక్తులు ఉన్నాయని నమ్మించి అమాయకులకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో కాప్రాలో పలువురు వ్యాపారులు, స్థానికులకు చూపించి..ఈ రంగురాయి సాగరకన్య నోటిలో నుంచి తీసిన జలకాంతం అని మాయమాటలు చెప్పారు. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుందని నమ్మించారు. రూ.2 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ రాములు బృందం ఇద్దరు నిందితులు చందు, సాంబశివలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
(చదవండి: సమరానికి సై.. ఫార్ములా–ఈ పోటీలకు రేసర్లు రెడీ.. )
#
Tags : 1