Breaking News

గొంతు మార్చి.. ఏమార్చి!

Published on Sat, 08/10/2024 - 07:03

సాక్షి, హైదరాబాద్‌: వాయిస్‌ ఛేంజ్‌ ఫీచర్‌ సాంకేతికతతో అమ్మాయిల గొంతులాగా మాట్లాడుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్‌ నేరస్తులను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ కాశీ విశ్వనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన కోమలి సూర్య ప్రకాశ్, శెట్టి సతీష్‌లు ఇంటర్నెట్‌ నుంచి అమ్మాయిల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసి నకిలీ పేరు, ఇతరత్రా వివరాలతో మ్యాట్రిమోనీ సైట్లలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 

నకిలీ ప్రొఫైల్స్‌ను మ్యాట్రిమోనిలో అబ్బాయిలకు పంపించేవారు. తీయని మాటలతో వాట్సాప్‌ చాట్‌లు, ఫోన్లు మాట్లాడుతుండేవారు. కొద్ది రోజుల తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంటారు. బాధితుల కుటుంబ వివరాలు, ఫొటోలను వాట్సాప్‌ ద్వారా సేకరించేవారు.  తల్లిదండ్రులకు అనారోగ్యం, చదువుల ఫీజులు, వ్యాపారంలో నష్టాలు అంటూ రకరకాల కారణాలు చెప్పి డబ్బులు వసూలు చేసేవారు. 

ఈ క్రమంలో రూ.13.27 లక్షలు మోసపోయిన బాధితులు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం ఇద్దరు నిందితులు సూర్య ప్రకాశ్, సతీష్‌లను అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ నిందితులు రామగుండం ఎన్‌టీపీసీ, సైబరాబాద్, రాచకొండ సైబర్‌  క్రైమ్‌ ఠాణాల పరిధిలోని పలువురు బాధితుల నుంచి ఇదే తరహాలో రూ.33.68 లక్షలు మోసం చేశారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)