ఫ్యూచర్‌ సిటీ.. పోలీసుల పోటీ!

Published on Wed, 01/08/2025 - 08:14

సాక్షి, సిటీబ్యూరో: పోలీసు వర్గాల్లో ప్రస్తుతం ‘ఫోర్త్‌ సిటీ’ హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. శివారు ప్రాంతాల్లోని జోన్, డివిజన్‌ పోలీసు పోస్టులకు డిమాండ్‌ విపరీతంగా ఏర్పడింది. ఫోర్త్‌ సిటీ ప్రతిపాదనతో శివార్లలో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ఊపందుకోవడంతో ఇదే అదనుగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు వారి ‘ఫ్యూచర్‌’ను చక్కదిద్దుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలోనే ఖాకీల బదిలీలు జరగనున్న నేపథ్యంలో ఆశావహులు ప్రభుత్వంలోని ప్రముఖులను, నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. 

ఖాకీలు, బిల్డర్లు.. చెట్టాపట్టాల్‌.. 
⇒ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ తరహాలో నాలుగో నగరం ‘ఫ్యూచర్‌ సిటీ’ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. యువత అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ హబ్‌గా ఫోర్త్‌ సిటీని నిర్మించాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే నాలుగో నగరంలో ఆరి్టఫీషియల్‌ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్‌ సిటీ, మెడికల్‌ టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాలకు ప్రాతినిధ్యమిస్తున్నారు.  

⇒ రంగారెడ్డి జిల్లాలోని బేగరికంచె, మీర్‌ఖాన్‌పేట, ముచ్చర్ల ప్రాంతాలలో రానున్న ఫోర్త్‌ సిటీ కోసం ప్రభుత్వం ఇప్పటికే 13,973 ఎకరాల భూమిని సేకరించింది. మరో 15 వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ చేయనుంది. స్థిరాస్తి నిపుణులు అంచనా ప్రకారం ఫోర్త్‌ సిటీ ప్రతిపాదన తర్వాత ఆయా ప్రాంతాలలో భూముల ధరలు 30– 40 శాతం మేర పెరిగాయి.  

⇒ ముచ్చర్ల, దాసర్లపల్లి, కడ్తాల్, నేదునూర్, కందుకూరు, మీర్‌ఖాన్‌పేట, తుమ్మలూరు, మహేశ్వరం, గూడూరు, పంజగూడ, నాగిరెడ్డిగూడ, మక్త మాదారం, ఆమన్‌గల్, యాచారం ప్రాంతాల్లోని భూములకు డిమాండ్‌ పెరిగింది.  రియల్టర్లతో పోలీసులు సత్సంబంధాలు కొనసాగిస్తారనే అభిప్రాయం ఉంది. దీంతో తమ అనుయాయులు పోస్టింగ్‌ల్లో ఉంటే స్థిరాస్తి క్రయ విక్రయాలు, తగాదాలలో ఇబ్బందులు తలెత్తవని పలువురు బిల్డర్లు భావిస్తున్నారు. 

జోన్, డివిజన్‌ పోస్టులకు పైరవీలు.. 
మహేశ్వరం మండలంలో ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేయడంతో.. శివారు ప్రాంతాల్లోని జోన్, డివిజన్‌ పోలీసు పోస్టులకు డిమాండ్‌ ఏర్పడింది. మహేశ్వరం, యాదాద్రి– భువనగిరి, శంషాబాద్‌ డీసీపీలతో పాటు మెదక్, వికారాబాద్‌ ఎస్పీ పోస్టింగ్‌లకు ప్రాధాన్యం ఏర్పడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా ప్రాంతాలకు కొత్త పోలీసు బాస్‌లను నియమించినప్పటికీ.. ఏడాది కాలం పూర్తవడంతో బదిలీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. దీంతో ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా.. మహేశ్వరం జోన్‌ పరిధిలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం డివిజన్లతో పాటు ఆయా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) పోస్టులకు పైరవీలు తుది దశకు చేరుకున్నాయి.

ఫ్యూచర్‌కు డైనమిక్‌ ఐఏఎస్‌.. 
ఫోర్త్‌ సిటీ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు, భారీ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. ఇంధనం, రెవెన్యూ శాఖల్లోని పలువురు డైనమిక్‌ ఐఏఎస్‌లను నాలుగో నగరి బాధ్యతలు అప్పగించేందుకు త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయనన్నట్లు తెలిసింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ, భద్రత, నిర్వహణ కోసం ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ఏర్పాటు చేయనున్నారు. నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌), గ్రేటర్‌ నోయిడా ఇండ్రస్టియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో ఈ అథారిటీ కార్యాచరణ, విధి విధానాలు ఉండనున్నాయి.  

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)