Breaking News

కరెంట్‌ షాక్‌తో నలుగురి దుర్మరణం

Published on Thu, 06/26/2025 - 02:59

ఇల్లెందురూరల్‌/నేరడిగొండ/గంగారం : వేర్వే రు చోట్ల విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మూడు జిల్లాల పరిధిలో బుధవారం ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన ఏనుగు నర్సయ్య (60), ఎర్రమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. అందరికీ వివాహాలు జరగ్గా, చిన్న కుమారుడు ప్రవీణ్‌ (35) తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. పొలం పనులకు వెళ్లాలని బుధవారం తెల్లవారుజామునే నిద్రలేచారు. 

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఆరుబయట నేల బురదమయంగా మారింది. ముందుగా ఎర్రమ్మ నిదానంగా అడుగులు వేస్తూ చేతికందే ఎత్తులో ఉన్న దండెం తీగను ఆసరాగా పట్టుకుంది. అప్పటికే విద్యుత్‌ సర్వీసు వైరుకు తగిలి ఉన్న దండెం నుంచి కరెంట్‌ ప్రసారం కావడంతో ఎర్రమ్మ షాక్‌తో కింద పడింది. ఆ వెనుకాల వస్తున్న నర్సయ్య.. భార్య జారి పడిందని భావించి పైకిలేపే ప్రయత్నం చేయగా ఆయనకు కూడా షాక్‌ తగలడంతో బిగ్గరగా అరిచాడు. 

ఏం జరిగిందోనని పరుగున బయటకు వచ్చిన ప్రవీణ్‌ నేరుగా వారి వద్దకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేయడంతో ఆయనా షాక్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో నర్సయ్య, ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఎర్రమ్మను స్థానికులు తొలుత ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంకు తరలించారు.  

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన యువ రైతు సాబ్లే సుభాష్‌ (35) తన పత్తి చేలో కలుపు తీస్తుండగా.. వేలాడుతున్న విద్యుత్‌ తీగ ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, విద్యుత్‌ తీగలు వేలాడుతున్న విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని మృతుని బంధువులు ఆరోపించారు.  

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన చిలుక ప్రవీణ్‌(28) గత ఏడాది మార్చిలో జూనియర్‌ లైన్‌మ్యాన్‌గా మహబూబాబాద్‌ గంగారం మండలంలో విధుల్లో చేరారు. కోమట్లగూడెం రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి త్రీఫేజ్‌ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో సబ్‌స్టేషన్‌ నుంచి ఎల్‌సీ తీసుకొని మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌ ప్రసారం కావడంతో ప్రవీణ్‌ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సౌమ్య ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)