Breaking News

ప్రజలకు ‘విజయ’ మరింత చేరువ కావాలి

Published on Fri, 08/04/2023 - 02:58

రాజేంద్రనగర్‌ (హైదరాబాద్‌): నాణ్యతా ప్ర మాణాలతో కూడిన విజయ వంటనూనెలను ప్రజలకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మించనున్న విజయ వంటనూనెల మెగా ఆయిల్‌ ప్యాకింగ్‌ స్టేషన్‌ కర్మాగారం నిర్మాణానికి మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశా రు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తు తం శివరాంపల్లిలోని ప్యాకింగ్‌ కేంద్రం మూడు షిఫ్ట్‌లలో నడుస్తోందన్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన 3.8 ఎకరాల భూమిని ఆయిల్‌ ఫెడ్‌ సంస్థకు కేటాయించామన్నారు. రాబోయే రోజుల్లో ఆధునాతన యంత్రాలతో పూర్తి మైగ్రేడ్‌ పద్ధతిలో ప్యాకింగ్‌ స్టేషన్‌ను నిర్మించి ప్రజలకు నాణ్యమైన వంట నూనెలను అందిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయిల్‌ ఫెడ్‌ సంస్థకు స్థలాన్ని కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నా రు. రూ.25 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనమైన విజయ హైదరాబాద్‌ మెగా ప్యాకింగ్‌ కేంద్రం, కీసర తాగునీరు కర్మాగారాలను జనవరి 2024లోపు పూర్తి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ, డైరెక్టర్‌ సురేందర్, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)