నిధుల మళ్లింపుపైనే ఈడీ దృష్టి

Published on Fri, 01/10/2025 - 05:34

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా – ఈ కారు రేసు కేసు దర్యాప్తులో భాగంగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బ్రిటన్‌ కంపెనీకి హెచ్‌ఎండీఏ నుంచి నిధు ల మళ్లింపుపైనే ప్రధానంగా అర్వింద్‌కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది. ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డి విచారణ సందర్భంగా సేకరించిన అంశాల ఆధారంగా అర్వింద్‌కుమార్‌ను ఈడీ అధికారు లు ప్రశ్నించారు.

ఈడీ సమన్ల మేరకు గురువారం ఉదయం 11.15 గంటలకు ఆయన బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. అప్పటి నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. హెచ్‌ఎండీఏకి చెందిన రూ.54.89 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా బ్రిటన్‌కు చెందిన ఫార్ములా –ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈఓ) సంస్థకు ఎందుకు బదలాయించాల్సి వచ్చింది? హెచ్‌ఎండీఏ బోర్డు నిధుల ఖర్చు విషయంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయి? ఫార్ములా–ఈ కారు రేసు సీజన్‌ 9,10 నిర్వహణ కోసం చేసుకున్న ఒప్పందాలు.. తదితర అంశాలపై విచారణ జరిపినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. విధి నిర్వహణలో భాగంగానే తాను అంతా చేసినట్టు అర్వింద్‌కుమార్‌ సమాధానమిచ్చినట్టు తెలిసింది. అవసరం అయితే మరోమారు విచారణకు రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు అర్వింద్‌కుమార్‌కు సూచించినట్టు సమాచారం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)