Breaking News

ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు

Published on Thu, 04/10/2025 - 04:55

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు అయ్యింది. ఈయనపై ఇటీవల ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా పాస్‌పోర్టు రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్‌ పోలీసులు రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయానికి (ఆర్‌పీఓ) లేఖ రాశారు. దీంతో ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.  

గత ఏడాది మార్చిలో పరారీ... 
టి.ప్రభాకర్‌రావు 2023 డిసెంబర్‌ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అక్రమ ఫోన్‌ట్యాపింగ్‌ కేసు, తదితర పరిణామాలను గమనించిన ఆయన గత ఏడాది మార్చిలో తిరుపతి వెళ్లి అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. 

తనపై అరెస్టు వారెంట్‌ జారీ చేయొద్దంటూ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన సమయంలో ప్రభాకర్‌రావు తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, షెడ్యూల్‌ ప్రకారం 2024 జూన్‌ 26న తిరిగి వస్తానంటూ వివరణ ఇచ్చారు. ఆపై జూలైలో ఈ–మెయిల్‌ ద్వారా దర్యాప్తు అధికారి రాసిన లేఖలో తన ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇప్పట్లో తిరిగి రాలేనని స్పష్టం చేశారు.  

అప్పుడు ఇంపౌండ్‌...ఇప్పుడు క్యాన్సిల్‌  
రాష్ట్ర పోలీసులు తొలుత ఆర్‌పీఓ ద్వారా ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు ఇంపౌండ్‌ (సస్పెన్షన్‌) చేయించారు. ఆపై పాస్‌పోర్టు పూర్తిగా రద్దు చేయాలంటూ మరో ప్రతిపాదన పంపారు. ఈ ఫైల్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉండగానే, ప్రభాకర్‌రావు తన న్యాయవాదుల ద్వారా పాస్‌పోర్టు ఇంపౌండ్‌ చేయడాన్ని ఎంఈఏ జాయింట్‌ సెక్రటరీ వద్ద సవాల్‌ చేశారు. 

ఓ వ్యక్తిపై చార్జిషీట్‌ దాఖలు కావడం, న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం, బెయిలబుల్‌ వారెంట్‌ జారీ కావడం జరిగితేనే పాస్‌పోర్టు రద్దుకు ఆస్కారముంది. ప్రభాకర్‌రావు విషయంలో ఈ మూడూ ఉండటంతోపాటు ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు కూడా జారీ చేసింది. దీని ఆధారంగా పోలీసులు ఆర్‌పీఓకు మరో లేఖ రాయడం ద్వారా ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు చేయించారు.

రద్దు అయినా.. రప్పించడం ప్రహసనమే  
ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దయిన సమాచారం ఎంఈఏ, ఇమిగ్రేషన్‌ అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. ఆయన అమెరికా నుంచి మరో దేశానికి రాకపోకలు సాగించినా గుర్తించలేరు. కేవలం పాస్‌పోర్టు పేజీలు అయిపోవడం, గడువు తీరిపోవడం, పోగొట్టుకోవడం వంటివి జరిగితే.. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అధికారులు దాన్ని స్వా«దీనం చేసుకుంటారు. ఆపై ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయడం ద్వారా బలవంతంగా భారత్‌కు పంపుతారు. 

అలా కాకుంటే ప్రభాకర్‌రావు తనంతట తానుగా తిరిగి వస్తే...ఎల్‌ఓసీ మాదిరిగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగిస్తారు. దీంతో పోలీసులు ప్రభాకర్‌రావును అమెరికా డిపోర్టేషన్‌కు (బలవంతంగా తిప్పిపంపడం) సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ద్వారా ఆ దేశ ఏజెన్సీలను సంప్రదించి రెడ్‌కార్నర్‌ నోటీసుతోపాటు ఇతర వివరాలు అందిస్తున్నారు.   

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)