Breaking News

మధ్యవర్తిత్వంపై త్వరలో చట్టం

Published on Mon, 04/17/2023 - 01:34

సాక్షి, హైదరాబాద్‌: మధ్యవర్తిత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వెల్లడించారు. ఆ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం భారత మధ్యవర్తిత్వ దిన తొలి వార్షికోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్‌ ఎన్వీ రమణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మధ్యవర్తిత్వం ద్వారా కేసుల్ని రాజీ చేసుకొనే విధానాన్ని అనుసరిస్తేనే ఏ దేశమైనా న్యాయ వివాదాల సత్వర పరిష్కారం ద్వారా పురోగతి సాధిస్తుంది. ఎంఎన్సీ సంస్థల నుంచి సాధారణ స్థాయి సంస్థల్లో జరిగే ఒప్పందా ల్లో విదాదం ఏర్పడితే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్ర యించకుండా తొలి దశలో మధ్యవర్తిత్వం ద్వారా ఆ వివాదం పరిష్కరించుకొనేలా ఒప్పందం ఉండాలి.

హైదరాబాద్‌లో వేలాది నిర్మాణాలు జరుగుతున్నా యి. సివిల్‌ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశం ఉంది. తద్వారా అది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’అని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. 

చోళుల కాలంలోనే ‘మధ్యవర్తిత్వం’... 
దేశంలో చోళుల కాలం నుంచే మధ్యవర్తిత్వ ప్రయత్నాలు సాగేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి తెలిపారు. ‘వ్యాపార లావాదేవీల్లో వివాదాలను ఆర్బిట్రేషన్‌ విధానంలోనే పరిష్కరించుకొనేవారు. ఆర్బిట్రేషన్, చర్చలు, మధ్యవర్తిత్వం లోక్‌అదాలత్‌ ఇవన్నీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి (ఏడీఆర్‌) విభిన్న కోణాలే. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 2021–22 సమాచారం ప్రకారం దేశంలో 464 ఏడీఆర్‌ కేంద్రాలుంటే 397 పనిచేస్తున్నాయి.

570 మధ్యవర్తిత్వ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో ఇప్పటివరకు 53 వేల కేసులు పరిష్కారం అయ్యాయి. మధ్యవర్తిత్వ బిల్లు – 2021ను త్వరలోనే పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉంది. నిర్దిష్ట గడువులోగా మీడియేషన్‌ ప్రక్రియ పూర్తి (180 రోజుల్లో పూర్తి చేయాలి. లేనిపక్షంలో మరో 180 రోజులు పొడిగింపు), మధ్యవర్తుల నమోదుకు జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు, మధ్యవర్తిత్వ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నాక ఉభయ పార్టీలు అందుకు కట్టుబడి ఉండాలి.

మధ్యవర్తిత్వ వ్యవహారాలన్నీ గోప్యంగా ఉంచడం వంటివి ప్రతిపాదిత బిల్లులో కీలకాంశాలు. కోవిడ్‌ లాక్‌డౌన్‌ వేళ ఏడీఆర్‌ అమల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అవి ఆన్‌లైన్‌ వివాద పరిష్కార (ఓడీఆర్‌) దిశగా కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడ్డాయి’అని జస్టిస్‌ హిమాకోహ్లి పేర్కొన్నారు.  

సమయం, డబ్బు ఆదా: హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటును స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లో ఆర్బిట్రేషన్‌–మీడియేషన్‌ సెంటర్‌ ఏ ర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. ఈ సెంటర్ల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుంది. సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌–మీడియేషన్‌ ఒప్పందంపై భార త్‌ 2019 ఆగస్టు 7న సంతకం చేసింది. శ్రీకృష్ణుడు కౌరవ, పాండవుల మధ్య రాయబారానికి ప్రయచారు. అది విఫలం కావడంతోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పెను వినాశనానికి దారితీసింది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు రచ్చబండ విధానం ద్వారా స్థానికంగా వివాదాల్ని పరిష్కరించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వ విధానానికి ఆదరణ లభిస్తోంది’అని జస్టిస్‌ ఎన్వీ రమణ వివరించారు.  

33 కేసుల పరిష్కారం... 
ఐఏఎంసీ ఇప్పటివరకు 33 కేసుల్ని పరిష్కరించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు వెల్లడించారు. ఆర్బిట్రేషన్‌ ద్వారా పది కేసులు, మీడియేషన్‌ ద్వారా 23 కేసుల్లో మొత్తం 700 బిలియన్‌ డాలర్ల విలువైన వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ సీఈ వో జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్, సింగపూర్‌ ఐఏఎంసీ చైర్మన్‌ జార్జి లిమ్‌ ప్రసంగించారు. వారికి ఐఏఎంసీ రిజిస్ట్రార్‌ తారిక్‌ స్వాగతం పలికారు. తర్వాత మధ్యవర్తిత్వంపై పలు చర్చాకార్యక్రమాలు జరిగాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)