Breaking News

దామగుండం అడవిలో భారీ అగ్ని ప్రమాదం

Published on Sat, 11/30/2024 - 05:05

పూడూరు: వికారాబాద్‌ జిల్లాలో నేవీ రాడార్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్న దామగుండం అటవీ ప్రాంతంలో గురువారంరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 నుంచి 30 ఎకరాల మేర అడవి కాలి బూడిదైంది. ఇది ప్రమాదామా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూడూరు మండల పరిధిలో 2,900 ఎకరాల మేర దామగుండం అటవీ ప్రాంతం ఉంది. ఈ స్థలాన్ని ప్రభుత్వం నేవీ రాడార్‌ ఏర్పాటుకు కేటాయించగా, ఇటీవల భూమి పూజ చేశారు.

అడవి చుట్టూ రోడ్డు, ప్రహరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా రాత్రి అడవిలో భారీగా మంటలు చెలరేగాయి. అడవి సరిహద్దులోని వికారాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే వందూరుతండా సమీపంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడటంతో అగి్నమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్‌ వచ్చేలోపల దాదాపు 20 నుంచి 30 ఎకరాల అడవి కాలిపోయింది. ఈ ప్రాంతంలో చుట్టు పక్కల రైతులు, కాపరులు తమ పశువులను మేపుతుంటారు. ఈ నేపథ్యంలో ఎవరైనా కావాలనే అడవికి నిప్పు పెట్టారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాడార్‌ స్టేషన్‌ కోసం భూమి పూజ చేసిన స్థలానికి ఎదురుగా వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేసిన స్థల సమీపంలో ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగిన వీడియోలను స్థానికంగా ఉండే సత్యానందస్వామి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో అధికారులు స్పందించారు. జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఎఫ్‌ఆర్‌ఓ శ్యాంమ్‌కుమార్, నేవీ అధికారి మల్లికార్జునరావు, పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, చన్గోముల్‌ ఎస్‌ఐ ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. సత్యానందస్వామి ఉంటున్న ఆశ్రమానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)