Breaking News

బంగ్లాదేశ్‌ నుంచి నగరానికి వచ్చిన యువతి..

Published on Wed, 05/07/2025 - 07:17

బంజారాహిల్స్‌: ట్రావెల్‌ ఏజెంట్‌ సహకారంతో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి వ్యభిచారం చేసేందుకు అర్ధరాత్రి ఆ దేశ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించింది. మొదట పశ్చిమ బెంగాల్ చేరుకున్న ఆమె అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి, చివరకు హైదరాబాద్‌కు చేరుకుంది. జూబ్లీహిల్స్‌ పోలీసులు వ్యభిచార గృహంపై చేసిన దాడిలో పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే..బంగ్లాదేశ్, మాణిక్‌గోంజ్‌ జిల్లాకు చెందిన యువతి (23) 2024లో రకీబ్‌ అనే ట్రావెల్‌ ఏజెంట్‌ సహాయంతో అర్ధరాత్రి దేశ సరిహద్దు దాటి పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించింది. 

కొంతకాలం పాటు అతను ఆమెకు ఆ రాష్ట్రంలోనే  ఆశ్రయం కల్పించాడు. ఆమెకు సిమ్‌కార్డు సైతం సమకూర్చి బెంగళూరుకు తీసుకెళ్లి అక్కడ మూజమ్‌ అనే వ్యక్తికి అప్పగించాడు. నెల రోజుల పాటు గదిలో ఉంచిన మూజమ్‌ ఆమెతో వ్యభిచారం చేయించాడు. ఆ తర్వాత ఆమె  బెంగళూరులోని కోరమంగళకు పారిపోయి, బంగ్లాదేశ్‌కు చెందిన మిస్తి అనే స్నేహితుడిని కలుసుకుంది. అతని వద్ద రెండు నెలల పాటు తలదాచుకుంది. మిస్తి ఆమెను అఖిల్‌ అనే వ్యక్తికి అప్పగించగా, వ్యభిచారం చేస్తే ఎక్కువ జీతం ఇస్తానని అఖిల్‌ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో అఖిల్‌ సూచన మేరకు గత నెల 21న బస్సులో హైదరాబాద్‌ చేరుకున్న ఆమె అతని ఇంట్లో 10 రోజులు ఉంది. 

ఆ తర్వాత సదరు యువతి మరిన్ని డబ్బులు సంపాదించేందుకు నాయక్‌ అనే వ్యక్తిని ఫోన్‌లో సంప్రదించింది. నాయక్‌ ఆమెను గత నెల 30న జూబ్లీహిల్స్‌లోని మింట్‌ లీవ్స్‌ సరీ్వస్‌డ్‌ అపార్ట్‌మెంట్‌ రూం నెంబర్‌–112లో దించేందుకు క్యాబ్‌ ఏర్పాటు చేశాడు. కస్టమర్లను సంప్రదించి గదికి పంపుతానని నాయక్‌ ఆమెకు చెప్పాడు. అయితే వ్యభిచార దందాపై పోలీసులకు సమాచారం అందడంతో సదరు అపార్ట్‌మెంట్‌లోని గదిపై సోమవారం దాడులు నిర్వహించిన పోలీసులు బంగ్లాదేశ్‌ యువతితో పాటు కస్టమర్లను అరెస్టు చేశారు. యువతిని పునరావాస కేంద్రానికి తరలించిన  జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)