వికటించిన మధ్యాహ్న భోజనం

Published on Sat, 11/23/2024 - 04:44

గంగాధర (చొప్పదండి): కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. శుక్రవారం మధ్యాహ్నం అన్నం తిన్న పలువురు విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 205 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో శుక్రవారం 180 మంది హాజరయ్యారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలలో వండిన భోజనం తిన్నారు. కాసేపటికి ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.

ఇది చూసిన మరో 20 మంది విద్యార్థులు కడుపునొస్తోందని ఉపాధ్యాయులకు చెప్పారు. వెంటనే వారు ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వైద్యం అందించి, మాత్రలు ఇచ్చారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనానికి వండిన బియ్యం కొత్తవి కావడంతో పాటు అన్నం మెత్తగా కావడం వల్ల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఎంఈవో ప్రభాకర్‌రావు వివరించారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)