Breaking News

తెలంగాణాలో మరోసారి ఫుడ్‌ పాయిజన్‌ కలకలం

Published on Sun, 12/08/2024 - 20:46

సాక్షి,నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణాలో మరోసారి ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా,నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ అయ్యింది. కస్తూరిబా పాఠశాలలో ఆహారం తిని విద్యార్థులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.  

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఫలితంగా  ఇటీవల కాలంలో పాఠశాలలో భోజనం తిని అస్వస్థతకు గురవుతున్న ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. అందుకు నవంబర్‌ 27న  నారాయణపేట జిల్లా మాగనూర్‌ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్‌ ఘటనపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.

మాగనూర్‌ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే.. అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? వారికి కూడా పిల్లలున్నారు కదా! మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారు ' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ క్రమంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్‌ పాయిన్‌ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ఫుడ్‌ సేప్టీ కమిషనర్‌, అదనపు డైరెక్టర్‌, జిల్లా స్థాయి అధికారితో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్‌ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)