Breaking News

చీమలపాడు: ఆ తిండి తిని పశువులకు అస్వస్థత.. మూడు మృతి

Published on Sat, 04/15/2023 - 19:36

క్రైమ్‌: ఖమ్మం జిల్లా చీమలపాడు గ్రామంలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ శ్రేణులు అత్యుత్సాహంతో బాణాసంచా కాల్చగా.. వేదికకు దగ్గర్లోని ఓ గుడిసెకు నిప్పంటుకోవడం, ఆర్పడానికి వెళ్లిన వాళ్లు అందులోని సిలిండర్‌ పేలి మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలు అయ్యాయి కూడా. 

ఈ విషాదంతో ఆత్మీయ సమ్మేళనం రద్దు చేసుకుంది బీఆర్‌ఎస్‌. అయితే.. సమ్మేళనం కోసం వండిన వంటకాలను గ్రామ సమీపంలోనే పడేసి వెళ్లిపోయారు. దీంతో గ్రామంలోని కొన్ని పశువులు ఆ కుళ్లిపోయిన ఆహారాన్ని తిని అస్వస్థతకు గురయ్యాయి. మూడు ఆవులు మృతి చెందగా, మరికొన్నింటికి వైద్యం అందిస్తున్నారు.

నలుగురు గ్రామస్తుల మృతితో విషాదంలో ఉన్న తాము అక్కడ తిండి వదిలేసిన సంగతి గమనించలేదని, పశువులు నిత్యం అటువైపు మేతకు వెళ్తుండడంతో తాము పెద్దగా పట్టించుకోలేదని, ఇలా జరుగుతుందని అనుకోలేదని పశువుల యజమానులు వాపోతున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)