Breaking News

‘మామిడి కొనాల మీన’తో ట్రెండ్ సృష్టిస్తున్న నాగవ్వ

Published on Sun, 03/08/2026 - 12:01

సాక్షి, కరీంనగర్‌ డెస్క్‌: యక్షగానంతో ఆమె ప్రస్థానం ప్రారంభించింది. నాన్న పాటలను కైకట్టి నేర్చుకుంది. చదువుకోకున్నా జానపదాన్ని ఒంట పట్టించుకుంది. పంటపొలాల సాక్షిగా తన పాటలను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘తిరుపతి రెడ్డి’ అంటూ మొదలు పెట్టి ‘మోహన లా లి’ పాటతో పాపులర్‌ అ య్యింది. మంగ్లీతో జతకట్టి  ‘బాయిలోనే బల్లి పలికే’ పాటతో వరల్డ్‌ ఫేమస్‌ కాగా.. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాటతో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ సృష్టిస్తోంది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం 
గుల్లకోటకు చెందిన నాగవ్వ.

 

యక్షగానంతో ప్రారంభమై..
తల్లిగారి ఊరైన అంబారిపేటలో యక్షగానంతో నాగవ్వ పాట ప్రారంభమైంది. తండ్రి యక్షగానం వింటూ పెరగడంతో పాటు తనూ బతుకమ్మ పాటలు, జానపదాలు, కాముని పాటలు పాడేది. పెళ్లి తరువాత అత్తగారిల్లు గుల్లకోటకు వచ్చాక కూడా పాటను మర్చిపోలేదు. తన భర్త భజన పాటలు పాడుతూ.. నాగవ్వను కూడా గొంతు బాగుంటుందని ప్రోత్సహించడంతో పాటు కొడుకులిద్దరూ కలిసి ‘సీఎంఎస్‌ చానెల్‌’ పెట్టి జానపదాలు పాడించారు. అలా తను తొలిపాట ‘తిరుపతి రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకొచి్చంది. ‘మోహనలాలి’ పాటతో మరింత దగ్గరైంది. ‘సారంగదరియా షో’లో మూడు ఎపిసోడ్లలో పాల్గొంది. మంగ్లీతో కలిసి ‘కొప్పులోని పువ్వమ్మ బాయికాడి బతుకమ్మ’ పాట పడింది. తరువాత ‘బాయిలోనే బల్లి పలికే’ పాట ప్రపంచాన్ని ఊర్రూతలూగించింది. లక్షల్లో వ్యూస్‌ సంపాదించింది. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాట సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తూ.. వ్యూస్‌లో లక్షల్లో దూసుకెళ్తుంది. తనకు గుర్తింపు రావడానికి తన కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉందని నాగవ్వ చెబుతోంది. ముఖ్యంగా కొడుకులిద్దరూ తాను పాడడాన్ని ఎంతో ప్రోత్సహిస్తారని వివరించింది.

 

క్యాష్‌లెస్‌ లావాదేవీల్లో ‘నిర్మల’
యైటింక్లయిన్‌కాలనీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు డిజిటల్‌ చెల్లింపులపై రామగుండం కార్పొరేషన్‌ యైటింక్లయిన్‌కాలనీ అల్లూరు గ్రామానికి చెందిన చిరు కిరాణా వ్యాపారి బాలసాని నిర్మల శ్రద్ధపెట్టారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించి, అత్యధికంగా రూ.5,340 క్యాష్‌ బ్యాక్‌ పొంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దృఢసంకల్పానికి అబ్బురపడిన కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 26 గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. నిర్మల తన భర్త బాలసాని రవికుమార్‌ గౌడ్‌తో కలిసి ఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ చేతుల మీదుగా సత్కారం పొందారు.

స్వనిధి రుణంతో నవచైతన్యం
నిర్మల నవ చైతన్యం–2020లో సీఎం స్వనిధి పథకంలో తొలి విడతగా రూ.10వేలు రుణం పొంది ఇంట్లో కిరాణం ప్రారంభించారు. క్రమం తప్పకుండా రుణ వాయిదాలు డిజిటల్‌ రూపంలో చెల్లించడంతో ప్రభుత్వం రెండో విడతగా రూ.20 వేలు మంజూరు చేసింది. ఆ మొత్తంతో కిరాణంతో పాటు చీరల వ్యాపారం, కుట్టు మిషన్, మగ్గంవర్క్‌ ప్రారంభించి సక్సెస్‌ అయ్యారు. మూడోవిడత రూ.50వేలు రుణం పొంది ఆదర్శంగా నిలిచారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)