Breaking News

దేవుడి దీపమే.. ఆ ఇంటికి శాపమైంది

Published on Thu, 02/27/2025 - 11:31

శ్రీకాకుళం జిల్లా: ఆ కుటుంబానికి దీపమే శాపమైంది. కష్టార్జితాన్నంతా బూడిద చేసింది. వజ్రపుకొత్తూరు మండలం కొండవూరుకు చెందిన అడ్డి రమణ, విమల దంపతులు బుధవారం మహా శివరాత్రి పర్వదినాన ఇంట్లో దేవుడికి దీపం వెలిగించి శివాలయానికి వెళ్లారు. తిరిగి వచ్చే లోగా అగ్ని ప్రమాదం సంభవించడంతో తీరని నష్టం వాటిల్లింది. అప్పు తీర్చేందుకు తెచ్చిన రూ.1.15 లక్షల నగదు కాలిపోయింది. మూడు తులాల బంగారం, వెండి, విలువైన పత్రాలు, ఎల్‌ఐసీ పాలసీ బాండ్లు, దుస్తు లు, ఇతర సామగ్రి బూడిదైపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

కష్టార్జితం కాలిపోయింది.. 
మంకినమ్మ దాసుడైన అడ్డి రమణ.. కౌలు రైతు. భార్యాబిడ్డలతో కలిసి రేకుల ఇంట్లోనే నివాసముంటున్నాడు. గ్రామంలో ఓ వ్యక్తికి లక్ష రూపాయలు బాకీ ఉండటంతో గేదెలు అమ్మాడు. రూ.1.15 లక్షలు రావడంతో ఇంటిలోని దేవుడి మూల దాచిపెట్టాడు. రేపోమాపో అప్పు తీర్చుదామనుకోగా ఇంతలో ప్రమాదం జరగడడంతో లబోదిబోమంటున్నాడు. కాగా, ఈ ప్రమాదంలో కొంత సొమ్ము పాక్షికంగా కాలిందని, బ్యాంక్‌ అధికారులు స్పందించి చెల్లుబాటేయ్యేలా చూసి బాధితుడిని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్‌ కొల్లి భాస్కరరావు కోరారు. ఇదే విషయాన్ని వీఆర్‌ఓ, తహసీల్దార్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.  

Videos

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)