Breaking News

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

Published on Thu, 03/16/2023 - 20:14

సాక్షి, హైదరాబాద్‌:  సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో 7,8 అంతస్తుల్లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.

చుట్టుపక్కల పరిసరాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఆ కాంప్లెక్స్‌లో 16 మంది వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. దట్టమైన పొగ అలుముకోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.  కాంప్టెక్స్‌ లోపల పలు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ మంటలు 7,8 అంతస్తుల్లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  సికింద్రాబాద్ అగ్నిప్రమాదం లో సుమారు ఆరుగురు మహిళలు  చిక్కుకున్నట్లు సమాచారం. 

విద్యుత్ సరఫరా లేకపోవడంతో లిఫ్టులు పని చేయడం లేదు. అదే సమయంలో చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో చిక్కుకున్న మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. తమను కాపాడాలంటూ లోపలి నుంచి ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏడుగుర్ని కాపాడగా, మరో తొమ్మిది మంది లోపలే ఉండిపోయారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్‌గా ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది. 

చిక్కుకున్న వారితో ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉన్నాం
చిక్కకున్న వారితో ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉన్నామన్నారు ఘటనా స్థలికి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. ‘మంటలు అదుపులోకి వస్తున్నాయి.. చివరి భాగంలో మాత్రమే మంటలు ఉన్నాయి. ఎంత మంది లోపల ఉన్నారు అని తెలియదు.  ఏడు మందిని ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేశారు. పైన ఉన్నాం అని మంటల్లో చిక్కకున్న బాధితులే సెల్ ఫోన్ లైట్లు వేసి చూపిస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)