Breaking News

HYD: ఉమెన్స్‌ హాస్టల్‌లో అ‍గ్ని ప్రమాదం.. అమ్మాయిలను కాపాడిన స్థానికులు

Published on Thu, 02/05/2026 - 14:32

సాక్షి, ముషీరాబాద్‌: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉమెన్స్‌ హాస్టల్‌లో అ‍గ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వాష్‌రూమ్‌లో షార్ట్‌ సర్య్కూట్‌తో గీజర్‌ పేలి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు.. మంటలు వ్యాపించిన సమయంలో హాస్టల్‌లో ఉన్న ఇద్దరు అమ్మాయిలను స్థానికులు నిచ్చెన సాయంతో కిందకు తీసుకువచ్చినట్టు సమాచారం. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాంధీనగర్‌లో ‘సుధామ పీజీ అకామిడేషన్ ఫర్ విమెన్’ హాస్టల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా, వాష్‌రూమ్‌లో షార్ట్‌ సర్య్కూట్‌తో గీజర్‌ పేలి మంటలు చెలరేగినట్టు తెలిసింది.  ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్‌లో విద్యార్థినులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, హాస్టల్‌లో మంటలు వేగంగా వ్యాపించి భవనం నుండి భారీగా పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ముషీరాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో హాస్టల్‌లోని ఫర్నిచర్, దుస్తులు, ఇతర వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇక, హాస్టల్ యజమాన్యం నుండి వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)