చెర్వుగట్టులో షాట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

Published on Mon, 07/27/2026 - 01:29

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవస్థానం వద్ద ఆదివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ అయి 17 వస్తు విక్రయ దుకాణాలు ఆహుతయ్యాయి. ఈ సంఘటనలో దాదాపు రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. చెర్వుగట్టు గ్రామ పంచాయతీ దుకాణాల సముదాయం వద్ద భక్తులకు విక్రయించేందుకు బొమ్మలు, వివిధ ప్లాస్టిక్‌ వస్తువుల దుకాణాలున్నాయి.

ఆ షాపుల ముందు ఏర్పాటు చేసిన రేకులకు స్తంభం నుంచి వచ్చే వైర్‌ ద్వారా ఆదివారం తెల్లవారు జామున 3.15 గంటల సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో ఒక షాపులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు వరుసగా ఉన్న 17 షాపులు, తోపుడు బండ్లకు ఒకదాని వెంట మరోదానికి అంటుకుని కాలి బూడిదయ్యాయి. విషయం తెలిసిన వెంటనే నల్లగొండ, నార్కట్‌పల్లి సీఐలు ఆదిరెడ్డి, సురేశ్, ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. నల్లగొండ, రామన్నపేట, నకిరేకల్‌ నుంచి అగ్నిమాపక వాహనాల ద్వారా ఉదయం 5.30 గంటల వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. 

బాధితులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల వీరేశం 
నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం సంఘటన స్థలానికి విచ్చేసి బాధితులకు తక్షణ సాయంగా రూ.20 వేల చొప్పున అందజేశారు. నష్టం జరిగిన దుకాణదారులకు ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలసి ఈ సంఘటనను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు త్వరలో తగిన న్యాయం చేస్తామన్నారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా పరామర్శించారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)