Breaking News

కోరిక తీర్చకపోతే నీ భర్తను, పిల్లలను చంపేస్తా..!

Published on Thu, 08/14/2025 - 08:20

హైదరాబాద్‌: ‘తన కోరిక తీర్చకపోతే, తనతో రాకపోతే, తన ఫోన్లు లిఫ్ట్‌ చేయకపోతే నీ భర్తతో పాటు పిల్లలను చంపేస్తా’ అంటూ బెదిరిస్తున్న వ్యక్తిపై ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌లోని బండారు బాల్‌రెడ్డినగర్‌ బస్తీలో నివసించే వివాహిత (35) హౌస్‌ కీపింగ్‌ పని చేస్తున్నది. ఇదే బస్తీలో నివసించే సి.రవికుమార్‌ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూనే పరిచయాన్ని అడ్డదారుల్లోకి నెట్టాడు. ఆమె పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి తనతో పాటు బయటకు రావాలంటూ బెదిరించేవాడు.

 తన కోరిక తీర్చాలంటూ హెచ్చరించేవాడు. దీంతో ఆమె రవికుమార్‌ చేస్తున్న ఫోన్లకు సమాధానం ఇవ్వకపోవడంతో ఇటీవల ఆమెను వెంబడించసాగాడు. దీంతో ఆమె పని కూడా మానేసింది. అంతటితో ఊరుకోని నిందితుడు ఆమె భర్తకు కూడా ఫోన్‌ చేయసాగాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి. బుధవారం మళ్లీ ఫోన్‌ చేసి హెచ్చరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్‌ పోలీసులు రవికుమార్‌పై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 75 (2), 78, 351 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)