Breaking News

వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఘోరం

Published on Wed, 02/26/2025 - 08:36

భువనగిరి టౌన్‌: వారం రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోల్‌ గ్రామానికి చెందిన మామిడాల అనూష (30) 2020 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌. నాలుగు సంవత్సరాలుగా భువ­నగిరిలో విధులు నిర్వర్తిస్తూ విద్యానగర్‌లో నివాసముంటోంది. అనూషకు కోహెడ మండలానికి చెందిన యువకుడితో మార్చి 6న వివా­హం జరగాల్సి ఉంది. ఈ నెల 14న ఆమెకు వివాహ నిశ్చితార్థం జరిగింది. 

నాన్నకు యాక్సిడెంట్‌ అయ్యిందని చెప్పి..
నాన్నకు యాక్సిడెంట్‌ అయ్యిందని, తనకు సెలవు కావాలని అనూష మంగళవారం ఉదయం ఏఆర్‌ సీఐకి సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకుంది. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె మరో యువ­కుడితో ప్రేమలో ఉందని, తను ప్రేమించిన వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. అనూష కుటుంబ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం సమ­యంలో అనూషకు ఫోన్‌ చేయగా ఎత్తలేదు. 

దీంతో సహోద్యోగికి సమాచారం ఇవ్వగా, ఆమె అనూష  ఆత్మహత్య చేసుకుందని చెప్పింది. దీంతో వారు వెంటనే భువనగిరికి బయలుదేరి వచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనూష తల్లిదండ్రులు మామిడాల పద్మ, లక్ష్మయ్యలు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకనే అనూష ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చ‌ద‌వండి: నేత్రదానంతో ఇతరుల జీవితాల్లో వెలుగులు

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)