Breaking News

పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Published on Mon, 04/14/2025 - 07:51

జనగామ జిల్లా: పెళ్లి సంబంధం కుదరడం లేదన్న మనస్థాపంతో జనగామ జిల్లా కొడ కండ్ల మండలం నీలి బండ తండాకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ గుగులోత్‌ నీల (26) ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుగులోత్‌ హేమ, చిన్ని దంపతుల రెండో కుమార్తె నీల 2020లో ఏఆర్‌ కానిస్టే బుల్‌గా ఎంపికై వరంగల్‌లో పనిచేస్తోంది.

 శనివారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన నీల.. ఎవరూ లేని సమయంలో ప్యాన్‌కు ఊరి వేసుకుంది. పెళ్లి సంబంధం కుదరడం లేదన్న మనస్థాపంతో తన కూతురు ఆత్మహత్య చేసు కుందని మృతురాలి తల్లి చిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. 

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు
ముస్తాబాద్‌(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఆదివారం ఓ గర్భిణికి ముగ్గురు శిశువులు జన్మించారు. తల్లితో పాటు ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నారు. ముస్తాబాద్‌ మండలం చిప్పలపల్లికి చెందిన కొడెండ్ల సృజనకు ఆదివారం పురిటినొప్పులు రాగా.. మండల కేంద్రంలోని శ్రీతిరుమల నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు స్రవంతి, శ్రీకాంత్‌లు.. సృజన గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నట్లు గుర్తించి.. వెంటనే శస్త్రచికిత్స చేశారు. సృజన ఇద్దరు ఆడ శిశువులు, ఒక మగ శిశువుకు జన్మనిచ్చారు. ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ 15వేల మంది గర్భిణుల్లో.. ఇలా ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మిస్తారని తెలిపారు.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)