Breaking News

విద్యాసంస్థలు బంద్‌.. సర్కార్‌ ప్లానేంటి?

Published on Mon, 11/03/2025 - 07:39

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక బంద్‌ను పాటించనున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, బీఈడీ తదితర వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు బంద్‌కు ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. దీంతో, కాలేజీలు మూతపడనున్నాయి.

రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, దీపావళి నాటికి ప్రభుత్వం 600 కోట్లు ఇస్తామని భరోసా ఇచ్చినప్పటికీ ప్రభుత్వ హామీ నిలబెట్టుకోలేకపోవడంతో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ఆందోళన బాట పట్టాయి. కాలేజీలు నడపలేకపోతున్నామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో తక్షణమే బకాయిల్లో 50 శాతం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. అయితే, బంద్‌ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం 1200 కోట్లకు టోకెన్లు ఇచ్చి కేవలం 300 కోట్లు అందించినట్టు సమాచారం.  

TS: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రైవేటు కాలేజీల పోరుబాట

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)