Breaking News

Fee Reimbursement: అప్పటి వరకు కాలేజీలు బంద్‌!

Published on Thu, 11/06/2025 - 09:29

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నాలుగో రోజు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల బంద్ కొనసాగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను 50 శాతం చెల్లించాలని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో నిన్న(బుధవారం) ప్రభుత్వంతో చర్చలకు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య వెళ్లినప్పటికీ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో, ఫెడరేషన్ ప్రతినిధులు వెనక్కి వచ్చేశారు.

కాగా, పదివేల కోట్ల రీయింబర్స్‌మెంట్‌ (Fee Reimbursement) బకాయిల్లో రూ.5,000 కోట్లు విడుదల చేసేదాకా కాలేజీల నిరవధిక బంద్‌ కొనసాగుతుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హైయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (FATHI) స్పష్టంచేసింది. మిగతా రూ.5,000 కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకూ కాలేజీల బంద్‌ పాటిస్తామని ఫతి చైర్మన్‌ నిమ్మటూరి రమేశ్‌బాబు తేల్చిచెప్పారు.

బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఫతి కార్యవర్గ సమావేశం అనంతరం రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం యాజమాన్యాలు పోరాడాల్సిన పరిస్థితి దాకా సర్కార్‌ నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. అసలు విద్యార్థులు, కాలేజీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు కావా? అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున కాలేజీలు బంద్‌ పాటిస్తుంటే ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదని, ఈ సమస్యను ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టిందని నిలదీశారు.

అధ్యాపకులకు జీతాలిచ్చే పరిస్థితి లేకపోవడవంతోనే తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము బంద్‌కు దిగాల్సి వచ్చిందని చెప్పారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల ఎనిమిదో హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో అధ్యాపకులతో భారీ సభను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సభకు ‘తెలంగాణ అధ్యాపకుల సాంత్వన సభ’గా పేరు పెట్టామని, లక్షన్నర మంది అధ్యాపకులతో ఈ సభ జరుగుతుందని తెలిపారు. 10 లక్షల మందితో చలో హైదరాబాద్‌ పేరిట ఇదే నెల 11న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యాచరణ విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)