Breaking News

సెవెన్‌ స్టార్‌’ బిచ్చన్న.. ఈయన కథ వేరే లెవెల్‌..

Published on Sun, 06/15/2025 - 12:15

ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం నాన్న.. తాను కొవ్వొత్తిలా కరుగుతూ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహరి్నషలు కష్టపడే శ్రామికుడు నాన్న.. జీవన ప్రయాణంలో తన స్వార్థం కోసం చూసుకోకుండా.. బిడ్డలను ఒడ్డున చేర్చేందుకు పరితపించే నావికుడు నాన్న.. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే తపనతో.. చివరి శ్వాస వరకూ రక్తమాంసాలను కరిగించే యోధుడు నాన్న.. ఎన్ని జన్మలైనా.. ఎంత సేవ చేసినా తీర్చుకోలేని రుణం నాన్న.. అందుకే నాన్నా.. మీరే మా హీరో. ఆదివారం జాతీయ పితృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..

‘సెవెన్‌ స్టార్‌’ బిచ్చన్న 
కొడంగల్‌ రూరల్‌: పట్టణానికి చెందిన బిచ్చన్న – విజయలక్ష్మి దంపతులకు ఏడుగురు సంతానం. దర్జీ వృత్తి చేస్తూ పిల్లలను చదివించారు. ఆ కాలంలో ఏడుగురిని చదివించడమంటే ఆషామాషీ కాదు.. కానీ బిచ్చన్న బెదరలేదు.. పేదరికాన్ని జయించి కొడుకులను ఉన్నత స్థానంలో నిలిపారు. మొదటి కుమారుడు సత్యకుమార్‌ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ, ఐఐసీటీ.., సౌత్‌ఆఫ్రికాలో పోస్టు డాక్‌ చేశారు.

ప్రస్తుతం మస్కట్‌ దేశంలో యూనివర్సిటీ ఆఫ్‌ నిజ్వాలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ రీసర్చ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ ఐఐటీ బాంబే, ఎంఎస్‌సీ గణితం పూర్తి చేసి ప్రస్తుతం మస్కట్‌ దేశంలో హలీ బ్యాంకులో పని చేస్తున్నారు. మూడో కుమారుడు రవికుమార్‌ దౌల్తాబాద్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. నాల్గో కుమారుడు అనిల్‌కుమార్‌ మద్రాస్‌ ఐఐటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రస్తుతం కెనడియన్‌ కంపెనీలో రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వాటర్‌ టెక్నాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. 

ఐదో కుమారుడు శివకుమార్‌ ఎంబీఏ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఓ ప్రముఖ నగల దుకాణంలో సీనియర్‌ హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. ఆరో కుమారుడు మనోజ్‌కుమార్‌ ఐఐఐటీ పూర్తి చేసి ఫీడెక్స్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా రాణిస్తున్నారు. ఏడో కుమారుడు నవీన్‌కుమార్‌ పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్‌సీ స్టాటిస్టిక్స్‌ పూర్తి చేసి అపెక్స్‌ కోవంటెజ్‌ ఎల్‌ఎల్‌సా, యూఎస్‌ కంపెనీలో డాటా ప్రోగ్రామర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలందరూ ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో బిచ్చన్న  సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)