Breaking News

కొడుకులారా.. కొరివైనా పెట్టరా?

Published on Sun, 04/27/2025 - 08:29

మానకొండూర్‌(కరీంనగర్ జిల్లా): కొడుకులు పుట్టారని సంబరపడితే.. కొరివి పెట్టకుండా కొట్టుకుంటున్నారు. కని, పెంచి, ప్రయోజకులను చేస్తే అనాథ శవంగా అంత్యక్రియలు జరపకుండా శవజాగరణ చేయించారు. దీంతో వృద్ధుడి మృతదేహం మూడ్రోజులు జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉండగా.. శనివారం పోలీసులు, గ్రామస్తుల జోక్యంతో అంత్యక్రియలు పూర్తిచేశారు.

 కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం వన్నారం గ్రామానికి చెందిన జంగిలి కొమురయ్య (74), రాజకొమురవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు జంగిలి ఓదెలు, జంగిలి రవి, ఇద్దరు కూతుళ్లు సంతానం. రాజకొమురవ్వ కొంతకాలం కిందటే చనిపోయింది. ఓదెలు, రవి మధ్య చాలా రోజులుగా భూ తగాదాలు జరుగుతున్నాయి. ఈనెల 24న ఇంటి వద్ద జంగిలి కొమురయ్య చనిపోయాడు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన కొడుకులిద్దరూ.. తన తండ్రి మృతిపై అనుమానం ఉందని, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. 

అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. శనివారం బ్లూకోల్ట్స్‌ సిబ్బంది వెంకట్రామయ్య ఫిర్యాదుతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కొడుకు తలకొరివి పెట్టాడు. కొమురయ్యది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్‌ సీఐ బి.సంజీవ్‌ తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)