Breaking News

వివాహేతర సంబంధం.. వాట్సప్‌ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..

Published on Sun, 04/20/2025 - 13:33

అచ్చంపేట (మహబూబ్‌నగర్): పట్టపగలే ఓ వ్యక్తిపై గొడ్డలి, సుత్తితో దాడిచేసి హతమార్చిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 15న అచ్చంపేట మండలం నడింపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై చోటు చేసుకున్న హత్య కేసు వివరాలను శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసులుతో కలిసి ఏఎస్పీ రామేశ్వర్‌ వెల్లడించారు. వివరాలిలా.. నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య చిన్న కుమారుడు పరమేశ్‌ అదే గ్రామానికి చెందిన సుగూరు మహేశ్‌ భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. గత నెల 10న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా గురుజాలకు ఆమెను తీసుకెళ్లాడు. 

తన భార్య అదృశ్యంపై అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో భర్త మహేశ్‌ ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న మహేశ్‌ బంధువులు గురుజాలకు వెళ్లి పరమేశ్‌పై దాడిచేసి సదరు మహిళను ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత పరమేశ్‌ వైఖరిలో మార్పు రాక పోవడం.. వాట్సప్‌ స్టేటస్‌లో ఈ నెల 15న మహిళతో ఉన్న ఫొటోలను పెట్టాడు. ఈ క్రమంలో భర్త మహేశ్‌ అదే గ్రామానికి చెందిన పదిర శివ, ఎడ్ల మహేశ్‌లతో కలిసి పరమేశ్‌ కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు పథకం రచించారు.  

ఈ నెల 15న అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్‌పై వెళ్తున్న పరమేశ్‌ తండ్రి బూరం వీరయ్య, సోదరుడు వెంకటేశ్‌ ను కారు, బైక్‌తో వెంబడించారు. నడింపల్లి సమీపానికి రాగానే ఒక్కసారిగా వీరయ్యపై గొడ్డలి, సుత్తితో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్‌పై దాడికి యత్నించగా.. సమీప గ్రా మస్తులు రావడంతో వదిలిపెట్టి వెళ్లారు. హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితులు గతంలో నేర చరిత్ర కలిగి ఉండటంతో వారిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. 

నిందితులను అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హత్య కేసును చేధించిన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్‌, ఉప్పునుంతల ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, ఇందిర, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో హెడ్‌ కానిస్టేబుల్‌ రమేశ్‌, కానిస్టేబుళ్లు విశ్వనాథ్‌, బాలస్వామి, మల్లేష్‌, విష్ణు ఉన్నారు.

భర్త, ఇద్దరు పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)