Breaking News

కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!

Published on Wed, 04/16/2025 - 11:14

అచ్చంపేట రూరల్‌: కుమారుడి వివాహేతర సంబంధానికి ఓ తండ్రి బలయ్యాడు. ప్రత్యర్థులు వెంటాడి వేటాడి దారుణంగా హతమార్చారు. ప్రశాంతంగా ఉండే నల్లమల ప్రాంతం ఈ హత్యతో ఒక్కసారిగా ఉలికిపడింది. గ్రామస్తుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య (54) చిన్న కుమారుడు పరమేశ్‌ అదే గ్రామానికి చెందిన భర్త, ఇద్దరు సంతానం ఉన్న ఓ వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. 

ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఆ మహిళను ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి సహజీవనం చేశారు. సదరు మహిళ భర్త, బంధువులు వారున్న ప్రాంతానికి వెళ్లి యువకుడిని చితకబాది.. మహిళను స్వగ్రామానికి తీసుకువచ్చారు. అయితే సదరు యువకుడు, అతడి కుటుంబసభ్యులపై మహిళ కుటుంబ సభ్యులు పగ పెంచుకున్నారు. ప్రతీకారం కోసం ఎదురుచూశారు. మంగళవారం వీరయ్య తన పెద్ద కుమారుడు వెంకటేశ్‌తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్‌పై వస్తున్న విషయాన్ని గుర్తించారు.

హైదరాబాద్‌–అచ్చంపేట ప్రధాన రహదారిపై నడింపల్లి సమీపంలో బైక్‌పై కొందరు వెంబడించగా.. మరికొందరు కారుతో వీరయ్య బైక్‌ను ఢీకొట్టారు. అనంతరం వారి కళ్లల్లో కారం చల్లి సుత్తి, గొడ్డలితో వీరయ్యపై విరుచుకుపడ్డారు. మెడ భాగంపై గొడ్డలితో వేటు వేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్‌పై దాడికి యత్నంచగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.   

ప్రధాన రహదారిపై ఆందోళన.. 
వీరయ్య హత్య విషయం తెలుసుకున్న అతడి బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌– అచ్చంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. గతంలో వీరయ్య కుటుంబంపై దాడి జరిగిన విషయంపై అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. 

అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని వీరయ్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిందితులకు పోలీసుల సపోర్టు ఉందని ఆరోపిస్తూ.. ఘటనా స్థలానికి వచ్చిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి యత్నంచారు  . గమనించిన తోటి పోలీసులు ఆర్టీసీ బస్సులో అతడిని అచ్చంపేటకు పంపించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాసులు చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవీందర్‌ తెలిపారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)