Breaking News

ఎంత పనిచేశావ్‌ నాన్న.. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో

Published on Sun, 11/10/2024 - 10:36

సిద్దిపేట : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ భర్త తన ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  

సిద్దిపేట టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహించే తేలు సత్యం ముదిరాజ్ (48) తేలు శిరీష (26) భార్యభర్తలు. వాళ్లిద్దరికి  అశ్వన్ నందన్(7),  త్రివర్ణ (5) ఇద్దరు పిల్లలు. కానీ విధికి ఆ చింతలేని కుటుంబాన్ని చూసి కన్నుకుట్టింది. హాయిగా సాగిపోతున్న సంసారంలో మనస్పర్ధలు చిచ్చు పెట్టాయి. దీంతో రెండో భార్య తేలు శిరీష కొన్నినెలల క్రితం భర్త సత్యంను వదిలి పుట్టింటికి వెళ్లింది.

పలు మార్లు కాపురానికి రావాలని కోరినా.. శిరీష కనికరించలేదు. దీంతో మనోవేధనకు గురైన సత్యం ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తాను ప్రాణాలు తీసుకుంటే పిల్లలు అనాధలవుతారని భావించిన సత్యం.. తన పిల్లలు (రెండో భార్య పిల్లలు) అశ్వన్ నందన్, త్రివర్ణలతో కలిసి సిద్దిపేట చింతల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

తండ్రి పిల్లలు కలిసి చింతల చెరువులో దూకడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చింతల చెరువులో దూకి బాధితుల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ముగ్గురి ప్రాణాలు అనంతలోకాల్లో కలిసిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధిపేట టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)