అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published on Wed, 07/22/2026 - 04:06

సైదాబాద్‌ (హైదరాబాద్‌): అమెరికాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ఐఎస్‌సదన్‌ డివిజన్‌ వాణీనగర్‌లో నివసించే వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్‌ అధికారి షేక్‌ అబ్దుల్‌ సయీద్‌ కుమారుడు షేక్‌ అబ్దుల్‌ నవీద్‌ (48) ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో వెళ్లారు. అక్కడి మెక్‌ ఫార్మా కంపెనీలో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

ఆయనకు భార్య నజియా సల్మా (45), కుమార్తె నేహా నహీన్‌ షేక్‌ (19), కుమారుడు హఫీజ్‌ ఉమర్‌ షేక్‌ (14), మరో కుమార్తె ఖతీజా షేక్‌ (8) ఉన్నారు. కాగా నవీద్‌ కుటుంబంతో కలిసి కారులో తాను నివసిస్తున్న ప్రాంతం నుంచి కారులో నవేడా అనే ప్రాంతానికి విహార యాత్ర (ఫ్యామిలీ టూర్‌)కు బయలుదేరారు. అయితే భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నజియా సల్మా, నేహా నహీన్‌ షేక్, హఫీజ్‌ ఉమర్‌ షేక్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలకు గురైన షేక్‌ అబ్దుల్‌ నవీద్, ఖతీజా షేక్‌లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

వాణీనగర్‌లో విషాద ఛాయలు 
యాకుత్‌పురా నియోజకవర్గం ఐఎస్‌సదన్‌ డివిజన్‌ వాణీనగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం పా­లవడంతో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. విష­యం తెలుసుకున్న యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్, ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్‌లు వాణీనగర్‌కు చేరు­కుని నవీద్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభు­త్వం వెంటనే తనకు, తన భార్య నజీమున్నీసా, సోదరుడు షేక్‌ అబ్దుల్‌ జావీద్‌లకు అమెరికా వీసాలు ఇప్పించాలని నవీద్‌ తండ్రి షేక్‌ అబ్దుల్‌ సయీద్‌ అభ్యరి్థంచారు.  

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)