Breaking News

కొందరికే యూరియా

Published on Mon, 09/01/2025 - 06:17

చిన్నశంకరంపేట/మిరుదొడ్డి/దోమకొండ/కేసముద్రం: యూరియా కష్టాలు రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్నిచోట్ల ఘర్షణలకు కూడా దారి తీస్తున్నాయి. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి సహకార సంఘం వద్ద యూరియా కోసం ఆదివారం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలైన్‌లో చెప్పులు పెట్టి పడిగాపులు కాశారు. యూరియా పంపిణీ సందర్భంగా ఒక బస్తా నాదంటే నాదని ఇద్దరు రైతులు కొట్టుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరికొందరు రైతులు వారిని సముదాయించారు. చివరకు కొట్టుకున్న ఇద్దరు రైతులకు యూరియా దొరకలేదు.  

⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని రైతువేదిక వద్దకు చుట్టు పక్క గ్రామాలకు చెందిన రైతులు శనివారం అర్ధరాత్రి నుంచే క్యూ కట్టి ఆదివారం తెల్లవారుజాము వరకు జాగారం చేశారు. అయితే యూరియా లారీ రాలేదని అధికారులు చెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు.  
⇒ కామారెడ్డి జిల్లా దోమకొండలోని సింగిల్‌విండో కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం ఆందోళన చేశారు. కొందరికి యూరియా దొరకపోవడంతోవ్యవసాయాధికారులు, సింగిల్‌విండో కార్యాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.  

⇒ మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం రైతు వేదిక వద్ద ఆదివారం అర్ధరాత్రి యూరియా టోకెన్ల కోసం రైతులు బారులుదీరారు. సోమవారం యూరియా బస్తాలు పంపిణీ చేయనుండగా, అధికారులు ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి క్యూలో నిల్చున్నారు.   

#

Tags : 1

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు