Breaking News

బస్తా కోసం భారంగా..

Published on Fri, 09/12/2025 - 05:06

కామారెడ్డి టౌన్‌ /కామేపల్లి/అర్వపల్లి/దేవరకద్ర /మఠంపల్లి/కేసముద్రం/ఖానాపురం: యూరియా కోసం రైతుల ఆందోళనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. టోకెన్ల కోసం, యూరియా లారీల కోసం ఎదురుచూపులు నిత్యకృత్యం అయ్యాయి.  

» కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్‌లోని పంపిణీ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూ లైన్‌లో నిలుచున్న రైతులు ఒక్కసారిగా సిరిసిల్ల రోడ్‌లో రోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి, సీఎంకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  
»  ఖమ్మం జిల్లా కామేపల్లి రైతు వేదికలో కూపన్లు ఇస్తున్నారని తెలిసి రైతులు వెళ్లారు. వారంరోజులుగా తిరుగుతుంటే ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నించగా జాస్తిపల్లి ఏఈఓ రవికుమార్, కామేపల్లి ఏఈఓ శ్రీకన్య తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని రైతులు వాపోయారు. అంతేకాక ఇది తమ ఆఫీస్‌ అని ఎక్కువ మాట్లాడితే కేసు పెడతామని బెదిరించారన్నారు.  
»  సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీఏసీఎస్‌ వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. చెప్పులు క్యూలైన్‌లో పెట్టి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశారు. యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు పీఏసీఎస్‌ ఎదుట హైవేపై రాస్తారోకో నిర్వహించారు.  
»  మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర పీఏసీఎస్‌ కేంద్రం వద్ద టోకెన్లు ఉన్న రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, టోకెన్లు లేని రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. మహిళా రైతుల అరుపులు, కేకలతో తోసుకున్నారు. ఈ తరుణంలో నార్లోనికుంట్ల సత్యమ్మ, డోకూర్‌ బాలకిష్టమ్మ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సత్యమ్మ చెవికి తీవ్ర గాయమైంది.  
» సూర్యాపేట జిల్లా మఠంపల్లి పీఏసీఎస్‌కు చెందిన నలుగురు డైరెక్టర్లు యూరియా కొరతకు నిరసనగా రాజీనామా చేశారు. తమ గ్రామాల్లోని రైతులకు యూరియా అందజేయలేకపోతున్నామన్న మనస్తాపంతో రాజీనామా చేస్తున్నట్లు డైరెక్టర్లు గోలి చంద్రం, పట్టేటి ఆంథోని, వల్లపుదాస్‌ చినలింగయ్యగౌడ్, పశ్యా రామనరసమ్మ చెప్పారు.  
» మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి, కల్వల గ్రామాల్లో సొసైటీ పాయింట్‌ వద్ద రైతులు గురువారం తెల్లవారుజామునే క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకే యూరియా లోడ్‌ లారీ రావాల్సి ఉండగా 11 గంటలైనా రాలేదు. కేసముద్రం విలేజ్‌ దర్గా వద్ద ఆ డ్రైవర్‌ యూరియా లోడ్‌ లారీ తీసుకొచ్చి నిలిపాడని పోలీసులు తెలుసుకున్నారు. 

దర్గా నుంచి ఉప్పరపల్లి వరకు లారీని తీసుకెళ్లి 220 బస్తాలను సెంటర్‌లో దింపించారు. ఆ తర్వాత కల్వల సెంటర్‌కు లారీని తీసుకెళ్లాల్సి ఉండగా, అప్పటికే లారీడ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ ఎండీ అలీమ్‌ ఆ లారీని తానే డ్రైవింగ్‌ చేసి కల్వలకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 220 బస్తాలను రైతులకు పంపిణీ చేశారు.  
» వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని గొల్లగూడెంతండాకు చెందిన తేజావత్‌ శ్రీను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. సరిపోను యూరియా లభించకపోవడంతో ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటను వదిలేశాడు. దీంతో పంటను గురువారం గొర్రెల కాపరులకు అప్పగించడంతో అవి మేశాయి.   

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)