Breaking News

వానలోనూ క్యూ కట్టిన రైతులు

Published on Fri, 08/29/2025 - 01:56

మిరుదొడ్డి/నంగునూరు/చెన్నూర్‌రూరల్, మహబూబ్‌నగర్‌నెట్‌వర్క్‌: జోరువానలోనూ యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి యూరియా లారీ వస్తుందని తెలియడంతో వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడిసి ముద్దవుతూనే గొడుగులు పట్టుకొని టోకెన్ల కోసం క్యూ కట్టారు.  

» నంగునూరు ఆగ్రోసేవా కేంద్రానికి యూరియా వస్తుందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు తెల్లవారు జామునే వచ్చి క్యూలైన్‌లో నిలబడ్డారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా రాత్రి వరకు నిరీక్షించారు.  
»   మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం దుగ్నేపల్లి గ్రామంలో రైతు బొంబురపు రాజిరెడ్డి యూరియా కోసం వరుసలో నిలబడి ఉండగా ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చి కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి రైతులు 108లో చెన్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  
»  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా యూరియా కష్టాలు తీరడం లేదు. జడ్చర్లలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. దేవరకద్ర, మూసాపేట, చిన్నచింతకుంట మండలాల్లోనూ ఇదే పరిస్థితి. నారాయణపేట జిల్లా మద్దూరు పీఏసీఎస్‌ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ పీఏసీఎస్‌ వద్ద పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేపట్టారు.  
»   నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ, కల్వకుర్తిలో పీఏసీఎస్, తిమ్మాజిపేటలోని ఆగ్రో కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి ఎదురుచూశారు. లింగాల మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు రెండు లారీల యూరియా రావడంతో రైతుల సంఖ్య పెరిగి తోపులాటకు దారి తీసింది.  
»   జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో తోపులాట, ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గట్టులోనూ రైతులు భారీగా తరలిరావడంతో పోలీసుల సమ క్షంలో యూరియా పంపిణీ చేశారు. వడ్డేపల్లిలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు కడుపు మాడ్చుకొని క్యూలైన్లలో నిల్చున్నారు.

#

Tags : 1

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు