Breaking News

అవే క్యూలు.. అవే కష్టాలు

Published on Thu, 08/21/2025 - 02:30

సాక్షి, మహబూబాబాద్‌/సిద్దిపేట/తిప్పర్తి: పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఇంకా తిప్పలు పడుతూనే ఉన్నారు. మహబూబా బాద్‌లోని పీఏసీఎస్‌ వద్ద బుధవారం రైతులు క్యూలైన్‌లో నిలబడి నిరీక్షించారు. మహబూబాబాద్‌ మండలం సింగారంలో ఓ దుకాణ యజమాని రైతులకు నేరుగా విక్రయించినట్టు తేలడంతో అతడి లైసెన్స్‌ సస్పెండ్‌ చేశారు. చిన్నగూడూరు మండలం విస్సంపల్లిలోనూ ఓ మందుల దుకాణంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు ఆ షాప్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేశారు.

నెల్లికుదురు సొసైటీ కార్యాలయం వద్ద రైతులు కుటుంబ సమేతంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్షంలోనూ లైన్లో చెప్పులు పెట్టి ఎదురుచూశారు. తొర్రూరులోని పీఏసీఎస్‌ ఎదుట రైతులు బారులు తీరారు.ఈ క్రమంలో ఓ రైతు అధికారి కాళ్లు మొక్కి యూరియా బస్తాలు ఇవ్వాలని వేడుకున్నాడు.ఈ ఘటనపై మాజీమంత్రి హరీశ్‌రావు స్పందించారు.

‘కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ పాతరోజులు వచ్చాయని, రైతులు యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి దాపురించింది’అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు పీఏసీఎస్‌ వద్ద కూడా రైతులు బారులుతీరారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలోని పీఏసీఎస్‌లోనూ రైతులు క్యూలో నిల్చున్నారు. వెనుక ఉన్నవారికి యూరియా దొరకక నిరుత్సాహంతో వెనుదిరిగారు. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో యారియా అందించాలని మహిళా రైతులు అధికారుల కాళ్లు మొక్కారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)