Breaking News

రైతు రుణమాఫీపై కేసీఆర్‌కు కృతజ్ఞతలు

Published on Fri, 08/04/2023 - 03:49

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీతోపాటు ఇటీవల కేబినెట్‌ తీసుకున్న పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్‌ను పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం శాసనసభకు వచ్చి న కేసీఆర్‌ను కలిసేందుకు సీఎం చాంబర్‌ వద్ద ఎమ్మెల్యేలు బారులు తీరడంతో సందడి నెలకొంది. రూ.19 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేస్తూ, సీఎం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ధన్యవాదాలు తెలిపారు.అలాగే హైదరాబాద్‌లో మెట్రోరైలు విస్తరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనంతోపాటు నోటరీ ఆస్తుల క్రమబద్దికరణ వంటి నిర్ణయాలపట్ల కృతజ్ఞతలు తెలిపారు.

కేసీఆర్‌ను రైతుబాంధవుడిగా పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతుల కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నాయని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, కొప్పుల, గంగుల, ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలవారీగా సంబంధిత జిల్లా మంత్రులతో కలిసి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి రైతు రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు వేణుగోపాలాచారి,   ఆంజనేయ గౌడ్‌ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, రైతన్నల మధ్య వాత్సల్యానికి అద్దంపట్టే క్యారికేచర్‌ను ఈ సందర్భంగా సీఎంకు అందజేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)