Breaking News

వరికి బదులు ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించండి

Published on Sat, 05/31/2025 - 00:53

సూర్యాపేట: రాష్ట్రంలో రైతులు వరికి బదులు ఆయిల్‌పామ్‌ సాగు చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని, దీనివల్ల రైతులు తాలు, తరుగు పేరుతో ఎలాంటి ఇబ్బందులు పడరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో మంత్రులు ఉత్తమ్‌కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలసి నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు పెంచేందుకు అవకాశం ఉందన్నారు. అందులో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇక్కడ ఆయిపామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పారు. కృష్ణాజలాలను పూర్తిగా వాడుకునేందుకు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. వివిధ పథకాల అమలులో ప్రజాప్రతినిధుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని, సంక్షేమానికి సంబంధించి శాసనసభ్యుల మాటే చివరి మాటగా పాటించాలని అధికారులకు సూచించారు. 

బ్యాంకర్లు సిబిల్‌ స్కోర్లు అడగొద్దు: మంత్రి ఉత్తమ్‌ 
రాజీవ్‌ యువ వికాసం పథకం లబి్ధదారులను బ్యాంకర్లు సిబిల్‌ స్కోర్‌ అడగవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు ఆయకట్టు ప్లాన్‌ సంసిద్ధం చేసి ముందే ప్రకటిస్తామని, ఎస్సారెస్పీలో ఒండ్రు మట్టి తొలగింపు ప్రక్రియ మొదలైందని, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదేవిధంగా చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, ధాన్యం సేకరణలో ముందున్నామని, గత సంవత్సరంతో పోలిస్తే 20 లక్షల మెట్రిక్‌ టన్నులు అధికంగా కొన్నామని ఉత్తమ్‌ తెలిపారు.  

ప్రజలు సంబురంగా ఉన్నారు: మంత్రి కోమటిరెడ్డి 
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సన్నబియ్యం పథకంతో ప్రజలు సంబురంగా ఉన్నారన్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకంతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి, నల్లగొండ కలెక్టర్లు తేజస్‌ నంద్‌లాల్‌ పవార్, హనుమంతరావు, ఇలా తిపాఠి, సూర్యాపేట ఎస్పీ నరసింహ, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జయవీర్‌రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)