Breaking News

నోటమాట రావట్లే!

Published on Tue, 02/24/2026 - 01:29

సాక్షి, మహబూబాబాద్‌: సాధారణ పంటలు వేస్తే అప్పుల పాలవుతున్నామని భావించిన రైతులు కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. టమాటా వేస్తే మంచి లాభాలు వస్తాయని భావించి సాగుచేసిన రైతులకు ఈ ఏడాది చేదు అనుభవం ఎదురైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, దిగుబడి పెరగడంతో అమాంతం ధర పత­నమైది. దీంతో టమాటా పండించినా.. అప్పుల పా­ల­య్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో వేసిన టమాటా తోటలకు వాతా­వరణం అనుకూలించింది. పెద్దగా చీడపీడలు ఆశించలేదు. రాష్ట్రంలోని వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 30 వేల ఎకరాల మేరకు టమాటా పంట సాగుచేశారు. ఇందుకుగాను గతం కన్నా ఎక్కువగా 2 లక్షల టన్నుల మేరకు దిగుబడి వచ్చినట్లు అంచనా.. దీనికి తోడు పక్కరాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా దిగుబడి ఎక్కువగా రావడంతో మార్కెట్‌ మందగించి ధర పతనమైంది. 

ధరలు పడిపోవడంతో తలపట్టుకున్న రైతులు
వానాకాలం పంటకు హోల్‌సేల్‌లో కేజీ రూ.25కు కొనేవారు. రిటైల్‌ ధర రూ.40 నుంచి రూ.50కి అమ్మేవారు. యాసంగి పంట రాగానే ధర పతనమైంది. 25 కిలోల పెట్టెను రూ. 100 నుంచి రూ.150కి అడుగుతున్నారు. వారాంతపు సంతల్లోకి ఆటోలు, ఇతర వాహనాల ద్వారా తీసుకొని వెళ్లే రైతులకు సాయంత్రం వరకు ఉండి అమ్ముకునే­వారు. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో టమాటా మా­ర్కెట్లకు రావడంతో, అమ్ముడు పోనివాటిని సా­యం­త్రం వరకు చూసి ఉచితంగా పంపిణీ చేయ­డం, లేదా కోతులకు పోసి రావాల్సి వస్తోంది. ఇంటి­కి తీసుకొని వెళ్తే మళ్లీ రవాణా ఖర్చులు అవుతా­యని, అందుకోసమే ఉచితంగా పంపిణీ చేస్తున్నా­మని కొందరు రైతులు చెబుతున్నారు.

నిల్వ చేయకపోవడంతోనే.. 
ధాన్యం, ఇతర పంటలను విక్రయించే సందర్భంలో రైతులకు అనుకూల ధర లేకపోతే.. నిల్వ చేసుకొని ధర వచ్చిన తర్వాత అమ్ముతారు. కానీ టమాటా విషయంలో మాత్రం నిల్వ చేసే పరిస్థితి లేదు. ఇందుకు కావాల్సిన కోల్డ్‌ స్టోరేజీలు లేకపోవడంతో చెట్టుమీద పండిన టమాటా కోస్తే రెండు, మూడు రోజులకు మించి నిల్వ ఉండే పరిస్థితి ఉండదు. అందుకోసమే ధర ఎక్కువ..తక్కువ ఉన్నా..అమ్మడం తప్ప మరో మార్గం లేదు.

ఈ ఫొటోలో కన్పిస్తున్న రైతు మహబూబాబాద్‌ మండలం గుండ్లబోడు తండాకు చెందిన ధరావత్‌ చంద్రు. తనకున్న ఎకరంలో టమాటా సాగు­చేశా­డు. నారు తెచ్చిన నాటినుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.50 వేల ఖర్చు వచ్చింది. ‘దిగుబడి బాగా ఉంది రూ.లక్ష మేరకు ఆదాయం వస్తుందని అనుకున్నా.. కానీ కిలో రూ.5కే అమ్మాల్సి వస్తోంది, దీంతో లాభమేమో కానీ పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడి కూడా రావడం లేదు
నాకున్న చెలకలో ఎకరం మేర కూరగాయలు వేస్తా. కూరగాయల మీద ప్రతీ సంవత్సరం రూ.లక్ష మేరకు లాభం వచ్చేది. ఈ ఏడాది రూ. 30 గుంటల్లో టమాటా వేశా. ఖర్చు రూ.50 వేలు దాటింది. కానీ ఇప్పుడు లాభం కాదు.. కదా పెట్టుబడి కూడా రావడం లేదు. నిల్వ చేసేటట్లు ఉంటే బాగుండేది. – బానోత్‌ బాలు, రేగడి తండా, మహబూబాబాద్‌

పెట్టె రూ. 100కే అడుగుతున్నారు
20 గుంటల భూమిలో టమాటా సాగుచేశా. ఎక్కువమంది రైతులు ఈ ప్రాంతంలో టమాట పంటను సాగు చేయడం.. దిగుబడి ఎక్కువ రావడంతో ధర గణనీయంగా తగ్గింది. మార్కెట్‌లో కేజీ రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయలకు కొనుగోలు చేస్తుండడంతో పెట్టుబడి మాట దేవుడెరుగు.. పంటను మార్కెట్‌కు తరలించినా రవాణా చార్జీలతోపాటు కోత కూలి కూడా రావడం లేదు. పెట్టె (25 కిలోలు) రూ.100కే అడుగుతున్నారు.    – ధరావత్‌ నంద, చాప్లాతండా, డోర్నకల్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)