Breaking News

ఆరుబయటే పంట.. శ్మశానంలో తంటా

Published on Thu, 04/17/2025 - 00:32

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఐకేపీ కేంద్రాలకు చేరుతోంది. ఈ సమయంలో అకాల వర్షాలు తిప్పలు పెడుతున్నాయని తల్లడిల్లుతున్నారు. నిర్దేశిత తేమశాతం వచ్చేందుకు ఎండలో ఆరబోస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరం కావడంతో.. ధాన్యం పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. కొనుగోళ్లు త్వరగా ప్రారంభించాలని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక శివారులో రహదారిపైనే రైతులు ఇలా ధాన్యం ఆరబోస్తుండడంతో.. రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనచోదకులు వాపోతున్నారు  – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

పాల్వంచ రూరల్‌: యాసంగి సీజన్‌లో వరి సాగు చేసిన కొందరు రైతుల పరిస్థితి మరీ దైన్యంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం, దంతలబోరు, సంగం, కారెగట్టు తదితర గ్రామాల రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు.. ఏటా ప్రభుత్వం సోములగూడెం శ్మశానవాటిక సమీపంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేది. ఈ ఏడాది కూడా అక్కడే ఏర్పాటు చేస్తారనే ఉద్దేశంతో రైతులు తమ ధాన్యాన్ని శ్మశానవాటికలోనే ఆరబోశారు. 

పదిహేను రోజులు దాటినా ఇప్పటికీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు కాకపోగా.. ఇటీవల నిత్యం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు రాత్రిపూట ధాన్యం కుప్పచేసి, ఉదయం మళ్లీ ఆరబెడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.2,320 మద్దతు ధరతో పాటు బోనస్‌ రూ.500 లభిస్తాయనే ఆశతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడం లేదు. 

అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతుందనే భయంతో 15 రోజులుగా రైతులు శ్మశానవాటికలో ధాన్యం రాశులపైనే నిద్రిస్తున్నారు. అయితే రాత్రి పూట అక్కడ పడుకోవాలంటే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని కోరుతున్నారు.   

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)