Breaking News

3 బస్తాలు సరిపోవు

Published on Mon, 01/05/2026 - 01:35

‘సార్‌.. నేను ఐదెకరాల్లో మక్కలేసిన. అవి మొలుస్తున్నయ్‌. యూరియా కావాలని సొసైటీకి పోతే ఎకరానికి 3 బస్తాలే ఇస్తమంటున్నరు. ఎకరానికి ఇప్పుడు 5 బస్తాలు కావాలె. అవి పెరిగినంక మల్ల 5 బస్తాలు కావాలె. మీ ఆఫీసర్లేమో పంట మొత్తానికి 3 బస్తాలే ఇస్తం అంటున్నరు’ అంటూ వ్యవసాయశాఖలో కీలక స్థానంలో పనిచేస్తున్నఓ అధికారికి నిజామాబాద్‌కు చెందిన ఓ రైతు ఫోన్‌ చేశాడు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విచ్చలవిడిగా యూరియా వినియోగం పెరిగిందనడానికి ఈ ఫోన్‌కాల్‌ ఓ ఉదాహరణ. ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే కాదు.. దాదాపు అన్ని జిల్లాల్లో యూరియా వినియోగం ప్రమాదకర రీతిలో పెరిగిపోయింది. ఓ వైపు ఎరువుల వినియోగం తగ్గించాలని పర్యావరణ వేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా... యూరియాతోపాటు ఇతర ఎరువుల వాడకం తగ్గడం లేదు. రాష్ట్రంలో యాసంగి ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాకముందే.. ఈ సీజన్‌లో వినియోగించే యూరియాలో 50 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. యూరియాతోపాటు కాంప్లెక్స్, డీఏపీ ఎరువు కూడా ఇప్పటికే 50 శాతానికి పైగా కొనుగోలు చేశారు. యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నా, జిల్లాల్లో యూరియా కోసం జనాలు పీఏసీఎస్‌లు, సొసైటీల వద్ద క్యూలు కడుతుండడం గమనార్హం. 

సాగు అంచనా 68.67 లక్షల ఎకరాలు..సాగైంది 13.89 లక్షల ఎకరాలు 
యాసంగిలో యూరియా వినియోగం ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలకే ఎక్కువ. అయితే రైతులు కూరగాయల నుంచి ఇతర అన్ని పంటలకు యూరియాను వినియోగించడం పరిపాటిగా మారింది. గత ఐదు సంవత్సరాల సగటు ఆధారంగా ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో వరి, 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇవి కాకుండా మిగతా అన్ని పంటలు కలిపి 69 లక్షల ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉందని లెక్కలు కట్టింది. కాగా జనవరి 1వ తేదీ వరకు వ్యవసాయ శాఖ జిల్లా నోడల్‌ అధికారి నివేదిక ప్రకారం వరి 4 లక్షల ఎకరాల్లో సాగవగా, మొక్కజొన్న 5.50 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. 
 
సాగుకు సంబంధం లేకుండా కొనుగోళ్లు 
కేంద్ర ప్రభుత్వం యాసంగిలో 10.40 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను కేటాయించింది. అందులో అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలలకుగాను ఇప్పటి వరకు 5.78 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేసింది. వానాకాలం సీజన్‌లో 133 లక్షల ఎకరాల్లో పంటలు సాగయితే, యాసంగిలో అందులో 60 శాతం మాత్రమే సాగవుతాయి. ఇప్పటికే రైతులు ఏకంగా 3.54 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కొనుగోలు చేశారు. సాగుతో సంబంధం లేకుండా రైతులు యూరియాను అడ్డగోలుగా కొనుగోలు చేసి, నిల్వ చేసుకోవడం ఒకటైతే... అవసరానికి మించి యూరియాను వాడడం మరో సమస్యగా మారింది. మొక్కజొన్న పంటకు ఏకంగా ఎకరానికి 10 బస్తాల యూరియాను వాడుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు ఓ వ్యవసాయ అధికారి ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం. 

డీఏపీ, కాంప్లెక్స్‌ వినియోగం కూడా అధికమే 
యూరియా తర్వాత అధికంగా వినియోగించే ఎరువుల్లో కాంప్లెక్స్, డీఏపీ. ఈ యాసంగి కోసం కేంద్రం 7 లక్షల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు కేటాయించగా, ఇప్పటి వరకు 3.84 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా అయ్యాయి. అందులో 1.21 లక్షల మెట్రిక్‌ టన్నులు రైతులు కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 1.21 లక్షల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ వినియోగించగా, ఇంకా డీలర్లు, సొసైటీలు, మార్క్‌ఫెడ్‌ వద్ద కలిపి 2.63 లక్షల మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉంది. డీఏపీ కూడా 1.45 ఎల్‌ఎంటీకిగాను 1.36 ఎల్‌ఎంటీ సరఫరా కాగా, దాదాపు లక్ష మెట్రిక్‌ టన్నులను రైతులు కొనుగోలు చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)