Breaking News

భూకబ్జా వ్యవహారం.. సీఐ కాళ్లపై పడిన బాధితురాలు

Published on Wed, 09/13/2023 - 13:59

వెల్దుర్తి(తూప్రాన్‌): అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తక్కువ ధరకు తమ భూమిని లాక్కోవాలని చూస్తున్నాడని, న్యాయం చేయాలని బాధితురాలు సీఐ కాళ్ల మీద పడి వేడుకుంది. ఈ ఘటన వెల్దుర్తి మండలం హస్తాల్‌పూర్‌ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన బొగ్గుల భిక్షపతి, జయలక్ష్మి దంపతులకు వెల్దుర్తి మండలం హస్తాల్‌పూర్‌ శివారులో 7.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 

ఈ భూమిలో సుమారు నాలుగెకరాల స్థలాన్ని శివ్వంపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి అక్రమంగా కబ్జాచేశాడని, రక్షణ క్పలించాలని బాధితురాలు సోమవారం ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తూప్రాన్‌ సీఐ శ్రీధర్‌ మంగళవారం హస్తాల్‌పూర్‌ శివారులో విచారణ చేపట్టారు. తమ వ్యవసాయ బోరుబావిని సైతం స్వాధీనం చేసుకున్నాడని, అడిగితే బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.

అదే గ్రామానికి చెందిన మరో రైతు కూడా నక్ష బాటను కబ్జా చేశాడని, పొలాల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. వారసత్వంగా వచ్చిన భూమిని ఆక్రమించిన వ్యక్తిపై చట్టపర చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ.. సీఐ శ్రీధర్‌ కాళ్ళమీదపడి బాధితురాలు ప్రాధేయపడింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)