Breaking News

తమ్ముడూ.. అమ్మ జాగ్రత్త!

Published on Tue, 01/07/2025 - 00:31

భూపాలపల్లి రూరల్‌: ‘తమ్ముడూ.. అమ్మ జాగ్రత్త.. అమ్మను బాగా చూసుకో.. అమ్మకు, నీకు తోడుగా, అండగా ఉండాల్సిన సమయంలో మీకు అన్యాయం చేసి తిరిగిరాని లోకానికి వెళ్తున్నా.. నన్ను క్షమించండి’.. అంటూ ఓ యువరైతు సెల్ఫీ వీడియో తీసి, లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన నీలాల శేఖర్‌ (29)తండ్రి రాజయ్య 15 ఏళ్ల క్రితం చనిపోయాడు.

తల్లి వెంకటమ్మ, తమ్ముడు సిద్ధూతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి సరిగ్గా లేక, పెట్టుబడి కూడా రాలేదు. రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. వీటిని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన శేఖర్‌.. నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న శేఖర్‌ ఆదివారం చనిపోయాడు. కాగా, తాను కచ్చితంగా చనిపోతానని భావించిన శేఖర్‌.. ముందే తీసిన సెల్ఫీ వీడియోలో అప్పుల బాధతోనే పురుగు మందు తాగినట్లు స్పష్టం చేశాడు. అంతకుముందే ఆయన రాసి పెట్టుకున్న లేఖ కూడా బయటికి వచ్చింది. లేఖ, సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)