Breaking News

వ్యభిచార గృహాలుగా ఫాంహౌస్‌లు!

Published on Mon, 02/12/2024 - 07:57

మొయినాబాద్‌: వారాంతపు విడిదిలు వ్యభిచార గృహాలుగా మారుతున్నాయి. వీకెండ్‌లో సరదాగా గడపడానికంటూ నగర శివారు ప్రాంతాల్లో నిర్మించుకుంటున్న ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడిచేసి గుట్టురట్టు చేస్తున్నా మళ్లీ కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు  ఫాంహౌస్‌లను లీజ్‌కు తీసుకుని వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వాటికి ఆకర్షితులై యువత పెడదారి పడుతుంది.  

హైదరాబాద్‌ శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది బడాబాబులు ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్, శంకర్‌పల్లి, శంషాబాద్‌ మండలాల్లో ఫాంహౌస్‌లు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఒక్క మొయినాబాద్‌ మండలంలోనే సుమారు వెయ్యికి పైగా ఫాంహౌస్‌లున్నాయి. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న మొయినాబాద్‌ మండలంలో చాలా మంది 10 గుంటల నుంచి 1 ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్‌ నిర్మిస్తున్నారు. వీకెండ్స్‌లో పిల్లలతో ఎంజాయ్‌ చేయడానికి ఫాంహౌస్‌లు నిర్మించుకుని తర్వాత వాటిని  ఇతరులకు లీజుకు, అద్దెకు ఇస్తున్నారు.  

నిర్వాహకుల అడ్డగోలు దందా.. 
ఫాంహౌస్‌లను అద్దెకు తీసుకున్న నిర్వాహకులు అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్‌ టూ గెదర్‌ పారీ్టలు, ఫ్యామిలీ పారీ్టలు, బర్త్‌డేలంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. ఫాంహౌస్‌లకు వచ్చే యువకులను ఆకర్షించే విధంగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఫాంహౌస్‌లలో ఉంచుతున్నారు. అమ్మాయిలను వ్యభిచారం రొంపిలోకి దింపి యువకుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. మొయినాబాద్‌ మండలంలోని కనకమామిడి, చాకలిగూడ, సురంగల్, శ్రీరాంనగర్, తోలుకట్ట, ఎత్‌బార్‌పల్లి, నక్కలపల్లి, అప్పారెడ్డిగూడ, ఎలుకగూడ, కుత్బుద్దీన్‌గూడ, రెడ్డిపల్లి, ఎనికేపల్లి, అజీజ్‌నగర్, బాకారం, అమ్డాపూర్‌ తదితర గ్రామాల పరిధిలో ఉన్న ఫాంహౌస్‌లలో ఈ దందాలు జోరుగా కొనసాగుతున్నాయి.  

నిఘా వైఫల్యం! 
ఫాంహౌస్‌ల్లో జరుగుతున్న వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలకు పోలీసుల నిఘా వైఫల్యమే కారణమని తెలుస్తుంది. ఫాంహౌస్‌లపై నిఘా పెట్టాల్సిన పోలీసులు నిర్వాహకులతో మిలాకత్‌ అవుతున్నట్లు సమాచారం. అందుకే ఫాంహౌస్‌ల్లో రాత్రిపూట ఎంత హంగామా జరిగినా పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎలుకగూడ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహించడం వల్ల యువకుల మధ్య జరిగిన గొడవలు ఓ యువకుడి ఆత్మహత్యకు దారితీసినట్లు సమాచారం.  అప్పడప్పుడు ఫాంహౌస్‌లపై జరుగుతున్న దాడులు ఎస్‌ఓటీ పోలీసులు చేస్తున్నవే కావడం విశేషం.  

వరుస ఘటనలు... 
మొయినాబాద్‌ మండలంలోని ఫాంహౌస్‌ల్లో వరుసగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆరు నెలల క్రితం కనకమామిడి రెవెన్యూలోని మ్యాంగోహుడ్‌ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. తాజాగా గురువారం రాత్రి కనకమామిడి రెవెన్యూ పరిధిలోని హ్యాపీహోంస్‌లో ఉన్న రాజు ఫాంహౌస్‌పై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ఓ వాచ్‌మెన్, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరాలపై సైతం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నారు. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)