Breaking News

TS: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఫేక్‌ వీడియో వైరల్‌

Published on Tue, 05/21/2024 - 12:10

గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్‌): రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ‘ఎక్స్‌’ఖాతాలో ఓ ఫేక్‌ వీడియో వైరల్‌ అయింది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్‌ఫోన్‌ వెలుగులో వైద్యసేవలు అందించారని, ఈ క్రమంలో ఓ బాలుడు మృతి చెందాడని, గొప్పులు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పనితీరు దరిద్రంగా ఉందని, గుంపు మేస్త్రీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ వీడియోను పెట్టారు. 

ఓ తెలుగు చానల్‌ లోగోతో ఉన్న వీడియో క్లిప్పింగ్‌ను జత చేస్తూ ‘బీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ’ఎక్స్‌ ఖాతాలో ఇది పోస్ట్‌ అయింది. దీనిపై సీఎం కార్యాలయం విచారణ చేపట్టగా అంతా ఉత్తదే అని తేలింది. పాత క్లిప్పింగ్‌తో డీప్‌ఫేక్‌ ద్వారా తప్పుడు వీడియోను సృష్టించారని విచా రణలో వెల్లడైంది. 

సీఎం పేషీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు చిలకలగూడ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. బీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ ఎక్స్‌ ఖాతాలో హరీశ్‌రెడ్డి అనే వ్యక్తి ఈ ఫేక్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. ఐటీ, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ ఎస్‌హెచ్‌ఓ అనుదీప్‌ తెలిపారు. వైద్యులు, సిబ్బందిపై నిందలు వే యడం తగదని గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు.

 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)