Breaking News

హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్‌ అధికారి అరెస్ట్‌

Published on Wed, 11/26/2025 - 13:34

సాక్షి, హైదరాబాద్:  నగరంలో మరో నకిలీ అధికారి సంచలనం రేపాడు. ఫిల్మ్‌నగర్ పోలీసుల పరిధిలో 2 ఏళ్లుగా తాను ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎన్‌ఐఏ అధికారి అంటూ ప్రజలను మోసం చేస్తున్న శశికాంత్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్‌పేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అతడిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. 

నకిలీ అధికారిగా కనిపించేందుకు శశికాంత్ ప్రత్యేకంగా బాడీగార్డులు, వాకీ టాకీలతో పాటు సైరన్‌ అమర్చిన ఓ కారు ఉపయోగించినట్లు దర్యాప్తులో బయటపడ్డాయి. అధికారులను అనుకరించే విధంగా ఫేక్ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎన్‌ఐఏ ఐడీ కార్డులు తయారు చేసి, అధికారిక లేఖల వరకు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

తాను డిప్యూటీ కమిషనర్ (మైన్స్‌)గా నమ్మపలికి పలువురు వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గోల్డ్ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ నుండి ఏకంగా రూ.10.50 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.

ఈ మోసాల్లో శశికాంత్‌తో పాటు A–2 ప్రవీణ్, A–3 విమల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా అరెస్ట్ సమయంలో రెండు మొబైల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీ టాకీలు, నకిలీ ఐడీలు వంటి సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు.

దీంతో తాము అధికారులమంటూ ఎవరైనా డబ్బు ఇవ్వాల్సిందిగా కోరితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వెస్ట్ జోన్ డీసీపీ ప్రజలకు సూచించారు. సదరు ఘటనపై ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. 

ఇదీ చదవండి: ప్రేమించిన యువతి మోసం.. పవన్ కళ్యాణ్ ఆత్మహత్య

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)