విత్తనాలకు వి‘పత్తి’

Published on Sun, 05/19/2024 - 05:13

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలు అన్నదాతను ముంచేస్తున్నాయి. వ్యవసాయశాఖ కొరడా ఝుళిపించకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా రైతులకు అంటగడుతున్నారు. వానాకాలం పంటల సీజన్‌ దగ్గర పడుతుండటంతో ఇప్పటికే లక్షలాది మంది రైతుల చెంతకు నకిలీ పత్తి విత్తనాలు చేరినట్లు సమాచారం. దళారుల ఒత్తిడితో కీలక సమయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం రైతుల పాలిట శాపంగా మారింది.

 తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని, కొందరు అధికారులు లంచాలు పుచ్చుకొని దళారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులు ఇప్పటివరకు కేవలం రూ.1.19 కోట్ల విలువైన 78 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. అయితే వేలాది క్వింటాళ్ల నకిలీ విత్తనాలు దొంగచాటుగా రైతులకు చేరుతున్నాయి.  

గుజరాత్, మహారాష్ట్రల నుంచి రాక 
ఈసారి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా. మార్కెట్లో ఎంఎస్‌పీ కంటే అధిక ధర రావడంతో అన్నదాతలు పత్తిపై ఎక్కు వగా ఆసక్తి చూపుతున్నారు. అందుకనుగుణంగా అధికారులు 1.20 కోట్ల విత్తనాల ప్యాకెట్లను రైతుల కు అందుబాటులో ఉంచారు. అయితే, ఇదే అదను గా ఆయా కంపెనీలు నకిలీ, నిషేధిత హెటీ కాటన్‌ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్రల నుంచి తరలించి జిల్లాల్లో దళారులకు అప్పగించా యి. 

చాలాచోట్ల రైతులకు అంటగట్టాయి. ఈ సీజన్‌లో వర్షం పడితే మొదటగా వేసేది పత్తే కాబట్టి ఇప్పటికే హెచ్‌టీ కాటన్‌ విత్తనాలు సరఫరా అయ్యా యి. గతేడాది ఎన్ని దాడులు చేసినా లక్షలాది ఎకరా ల్లో హెచ్‌టీ కాటన్‌ సాగైనట్లు సమాచారం. దీంతో అనేకచోట్ల రైతులు పంట పండక నష్టపోయారు.  

నకిలీకి లాభమెక్కువ... 
అదును రాగానే రైతులు గ్రామంలోని షావుకార్ల వద్దనో.. విత్తన వ్యాపారుల వద్దనో అప్పు కింద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. పంట వచ్చినప్పుడు అప్పు తీర్చేలా ఒ ప్పందం చేసుకుంటారు. ఎలా గూ అప్పు ఇస్తున్నారు కాబట్టి వ్యాపారి ఇచ్చిన విత్తనాలనే రైతు లు తీసుకుంటున్నారు. వీటికి ఎలాంటి రశీదు లు ఉండవు. డీలర్‌ నిబంధనల ప్రకారం అమ్మితే ఒక విత్తన ప్యాకెట్‌కు రూ.25–30 లాభం వస్తుంది. 

అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను విక్రయిస్తే రూ.500, లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ.1,200 చొప్పున ఆదాయం సమకూరుతోంది. వ్యవసాయ గణాంకాల ప్రకారం గ్రామాల్లో ప్రతి 100 మంది రైతుల్లో 47 మంది మండల కేంద్రాల్లోని అధికారిక దుకాణల నుంచి విత్తనాలు తీసుకుంటుండగా... 53 మంది షావుకార్లు, ఇతర వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకుంటున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు వడ్డీ వ్యాపారులు, విత్తన వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు చెబుతున్నారు. 

రీసైక్లింగ్‌ విత్తనాలు
కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్‌ చేసి కొత్తవని చెప్పి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. నాణ్యత లేని విత్తనాల వల్ల సరైన దిగుబడి రాక రైతాంగం నష్టాల ఊబిలో చిక్కుకుంటోంది. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, ఆవాలు, బఠానీ సహా దాదాపు 30 రకాల పంటలకు సంబంధించి రీసైక్లింగ్‌ విత్తనాలనే పలు కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఈ రీసైక్లింగ్‌ కుంభకోణంలో బహుళజాతి కంపెనీలు కూడా ఉండటం నివ్వెరపరుస్తోంది. 

రాష్ట్రంలో సరఫరా చేసే వాటిలో 15 నుంచి 20 శాతం వరకు రీసైక్లింగ్‌ విత్తనాలే ఉంటాయని అంచనా. గతంలో విజిలెన్స్‌ దాడుల్లో ఈ విషయాలు బయటపడినా చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారు. ఉన్నతస్థాయిలో అండదండలు ఉండటంతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోందని అంటున్నారు.   

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)