Breaking News

నకిలీ విద్యా సర్టిఫికేట్ల కలకలం.. ముఠా అరెస్టు

Published on Mon, 11/24/2025 - 09:51

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో ఫేక్‌ ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్ల తయారీ ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. సదరు ముఠా టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం, ఐదుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

వివరాల ప్రకారం.. నార్సింగిలో ఫేక్‌ సరిఫికెట్లు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అక్కడే మాటువేసిన పోలీసులు.. నెక్నాంపూర్ చింతచెట్టు వద్ద నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తుండగా ఓ ముఠాను పట్టుకున్నారు. సదరు ముఠా..  ఎస్ఆర్ఎం యూనివర్శిటీ, బెంగుళూరు సిటీ యూనివర్శిటీకి చెందిన ఫేక్‌ సరిఫికెట్లు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక, ఈ నకిలీ సర్టిఫికెట్లతో పాటు ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్స్, బోనాఫైడ్ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్.. కేవలం 50 వేలకు టెన్త్, 75 వేలకు ఇంటర్, 1.20 లక్షలకే డిగ్రీ సర్టిఫికెట్లను అమ్మకానికి పెట్టారు. గత కొంత కాలంగా నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తూ ఈ ముఠా సొమ్ము చేసుకుంటుంది.. ఒరిజినల్ సర్టిఫికెట్లు మాదిరిగా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేశారు. అనంతరం, ఈ ముఠాను నార్సింగి పోలీసులకు అప్పగించడంతో.. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముఠా సభ్యులు వీరే..
A1.మీర్జా అక్తర్ అలీ బైగ్ @ అస్లాం – నకిలీ సర్టిఫికెట్ల ప్రధాన తయారీదారు
A2.    మహ్మద్ అజాజ్ అహ్మద్ – డిమాండ్‌ సేకరణ మరియు సర్టిఫికెట్ల మధ్యవర్తి
A3.వడ్డేపల్లి వెంకట్ సాయి – నకిలీ డిగ్రీ కొనుగోలుదారు
A4.విస్టాలా రోహిత్ కుమార్ – నకిలీ సర్టిఫికెట్ల కొనుగోలుదారు
A5.సత్తూరి ప్రవీణ్ – నకిలీ బి.టెక్ సర్టిఫికెట్ కొనుగోలుదారు

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)