Breaking News

వివాహేతర సంబంధానికి అత్త అడ్డుగా ఉందని...

Published on Sun, 12/15/2024 - 13:42

పర్వతగిరి: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని ఓ కోడలు తన అత్తకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించింది. అత్త చికిత్స పొందుతూ మృతిచెందగా, తన తల్లిని చంపిందని భార్యపై భర్త శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతండాలో చోటుచేసుకుంది. స్థానికులు, హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన భూక్య మంజుల, దేవేందర్‌ భార్యాభర్తలు. 

మంజుల మూడేళ్లుగా వరంగల్‌లోని పెరుకవాడకు చెందిన సారయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం అత్త భూక్య గమ్మి(55)కి తెలిసి పలుమార్లు వారించింది. దీంతో మంజుల తన ప్రేమకలాపాలకు అత్త గమ్మి తరచూ అడ్డు వస్తుందని గతంలో రెండు సార్లు తలపై గాయం చేయగా, మరోసారి చేయి విరగ్గొట్టింది. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీన మంజుల తన అత్త గమ్మికి థమ్సప్‌లో పురుగుల మందు కలిపి తాగించింది. 

కొద్ది సేపటి అనంతరం గమ్మి కిందపడి కొట్టుకుంటుండగా కుమారుడు దేవేందర్‌ చూసి స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించగా ఆయన సూచన మేరకు తొర్రూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించే క్రమంలో శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. దేవేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)