Breaking News

ఔటర్‌పై టోల్‌ తీస్తున్నారు!

Published on Sun, 12/31/2023 - 04:04

హైదరాబాద్‌కు చెందిన ఓ వాహనదారుడు మూడు రోజుల క్రితం గచ్చిబౌలి నుంచి ఔటర్‌ మీదుగా టీఎస్‌పీఏ (అప్పా) వరకు వెళ్లారు. నిబంధనల మేరకు ఈ రూట్‌లో ఒకసారి వెళితే రూ.20, వెళ్లివస్తే రూ.30 చెల్లించాలి. కానీ సదరు వాహనదారుడి ఖాతా నుంచి ఏకంగా రూ.80 కోత పడింది. దీనిపై సంస్థ ప్రతినిధులను నిలదీయగా ‘సారీ’ అంటూ చేతులు దులిపేసుకున్నారు. 

కొద్దిరోజుల క్రితం మరో వాహనదారుడు గౌరెల్లి నుంచి ఘట్‌కేసర్‌ వరకు వెళ్లాడు. నిబంధనల మేరకు రూ.20 తీసుకున్నారు. కానీ తిరిగి అదేరోజు ఘట్‌కేసర్‌ నుంచి గౌరెల్లికి తిరిగి రాగా ఏకంగా రూ.115 వసూలు చేశారు. నిబంధనల మేరకు రిటర్న్‌ జర్నీకి రూ.10 చార్జీ చెల్లించాలి. ఒకవేళ నిర్ణీత సమయం మించితే వన్‌వే జర్నీ కింద రూ.20 తీసుకోవాలి.  

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై టోల్‌ ట్యాక్స్‌ దోపిడీ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా టోల్‌ చార్జీలను వసూలు చేస్తున్నట్లు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్టుగా వాహనదారుల ఖాతాల్లోంచి కొట్టేస్తున్నట్లు నిర్వహణ సంస్థకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గట్టిగా నిలదీసిన వాళ్లకు 25 రోజుల గడువులోపు తిరిగి చెల్లిస్తామంటున్నారు.. కానీ సకాలంలో ఖాతాలో జమ కావడంలేదని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. 158 కి.మీ. ఔటర్‌ మార్గంలో రోజూ వేలాది మంది వాహనదారులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. అధికంగా వసూలు చేసినట్లు గుర్తించిన వాహనదారులకు మాత్రమే తిరిగి చెల్లిస్తామని చెబుతున్నారు. కానీచాలామంది తమకు తెలియకుండానే మోసపోతున్నారు.

హెచ్‌ఎండీఏ నియంత్రణ ఏమైనట్లు.. 
జాతీయ రహదారులపై విధించే టోల్‌ చార్జీల నిబంధనలే హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఔటర్‌కు వర్తిస్తాయి. ఔటర్‌పై ప్రస్తుతం 21 ఇంటర్‌ఛేంజ్‌ల నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రింగ్‌రోడ్డును ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థకు ప్రభుత్వం టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో 30 ఏళ్ల లీజుకిచి్చంది. ఐఆర్‌బీ అనుబంధ సంస్థ అయిన ఐఆర్‌బీ గోల్కొండ సంస్థ టోల్‌ చార్జీలను వసూలు చేస్తోంది. నిబంధనల మేరకు హెచ్‌ఎండీఏ అనుమతితోనే టోల్‌ చార్జీలను పెంచుకొనేందుకు ఐఆర్‌బీకి అవకాశం ఉన్నా సొంతంగా పెంచేందుకు అవకాశం లేదు. ఐఆర్‌బీ అడ్డగోలుగా టోల్‌ వసూలు చేస్తున్నప్పటికీ హెచ్‌ఎండీఏ చర్యలు తీసుకోకపోవడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

విచారిస్తాం
ఔటర్‌పై అధికంగా టోల్‌ వసూలు చేయడానికి వీల్లేదు. వాహనదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారిస్తాం. ఎక్కువ డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే తిరిగి వాళ్ల ఖాతాల్లో జమ అవుతాయి.  – బీఎల్‌ఎన్‌ రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్, హెచ్‌ఎండీఏ 
 
టోల్‌ దోపిడీ దారుణం
టోల్‌ ట్యాక్స్‌ దోపిడీ దారుణంగా ఉంది. అవకతవకలను వాహనదారులు గుర్తించినప్పుడు మాత్రమే తిరిగి చెల్లిస్తామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ చాలామంది తమకు తెలియకుండానే నష్టపోతున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.  – కేతిరెడ్డి కరుణాకర్‌రెడ్డి దేశాయ్, వాహనదారుడు 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)