Breaking News

ఎగ్‌ కాంట్రాక్టు.. మరో నెల లేటు

Published on Thu, 04/17/2025 - 00:29

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడి కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో నెలపాటు పొడిగించింది. టెండరు విధానంలో నిర్దేశించిన నిబంధనలు కొంతమందికే అనుకూలంగా ఉన్నాయనే అంశంపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రత్యేక కథనం రావడంతో స్పందించిన ప్రభుత్వం మొదట ఒకసారి గడువును పొడిగించింది. అలాగే, పౌల్ట్రీ రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి అధికారుల వైఖరిపై ఫిర్యాదులు చేయడంతో తాజాగా మరోసారి గడువును పొడిగించారు. 

37,500 అంగన్‌వాడి కేంద్రాలకు ఏడాదిలో 36.96 కోట్ల గుడ్లు సరఫరా చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. ఆ మేరకు రాష్ట్రంలోని ఏడు జోన్ల పరిధిలో ఏడుగురు కాంట్రాక్టర్ల ఎంపికకు టెండర్లను పిలిచి, ఈ నెల 11న టెండర్లు తెరవాలని నిర్ణయించుకుంది. అయితే టెండరు నిబంధనలు పాత కాంట్రాక్టర్లకు అనుకూలంగా, కొత్తవారికి ప్రతిబంధకంగా ఉన్నాయనే అంశాలను ప్రస్తావిస్తూ ఈ నెల 6న ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. టెండరు నిబంధనల్లో సవరణలు చేస్తూ గడువు తేదీని ఐదు రోజులు పొడిగించింది. 

అయినప్పటికీ ప్రధాన నిబంధనల్లో సవరణలు చేయలేదంటూ పౌల్ట్రీ రైతులు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన టెండర్ల గడువును పొడిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో శిశుసంక్షేమ శాఖ.. మే 15 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని, 16న కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తామని ప్రకటిస్తూ సవరణ నోటిఫికేషన్‌ జారీచేసింది. కాగా, టెండర్‌ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పలువురు పౌల్ట్రీ రైతులు హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం వేసినట్లు తెలిసింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)