Breaking News

‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ దరఖాస్తుల గడువు పొడిగింపు

Published on Fri, 08/02/2024 - 15:12

సాక్షి, హైదరాబాద్‌:  ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం కోసం దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వెల్లడించింది. ఆవిష్కర్తలు తమ ఎంట్రీలను సమర్పించడానికి ఈ నెల 10 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది 6వ ఎడిషన్‌తో ముందుకు వచ్చిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం గ్రామీణ తెలంగాణలో ఆవిష్కరణ, వ్యవస్థాపకతను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

స్థానిక సవాళ్లకు పరిష్కారాలను తీసుకువచ్చే ఉద్దేశంతో, తమ ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు తయారు చేసిన ప్రజలను రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తూ, ఆ ఆవిష్కరణలను ఆగస్టు 15న ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తుంది.

దరఖాస్తులను వాట్సాప్‌ ద్వారా 9100678543కు పంపించాలి. పేరు, వయస్సు, ఫోటో, వృత్తి, గ్రామం, మండలం, ఆవిష్కరణ పేరు, ఆవిష్కరణ గురించి 100 పదాల వివరణ, నాలుగు అధిక-రిజల్యూషన్ చిత్రాలతో పాటు రెండు వీడియోలు (2నిమిషాలలోపు) పంపించాలని ఇన్నోవేషన్ సెల్ తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)